జగన్‌ను కలవకుండా..లోకేశ్‌ను కలిసిన బుట్టా రేణుక

వైసీసీ ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం కండువా కప్పుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన లోటస్‌పాండ్‌లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆమె డుమ్మా కొట్టారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె రాలేకపోయారేమోనని అందరూ భావించారు. ఇదే సమయంలో నిన్న కర్నూలు పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్‌ను ఆమె కలిశారు. దీంతో రేణుక పార్టీ మారబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయం జగన్ దృష్టికి రావడంతో ఆయన రేణుక వ్యవహారశైలిపై మండిపడ్డారు. పార్టీలో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని అన్నట్లు సమాచారం.