ప్రియురాలి ఇంటిముందు ప్రియుడి ధర్నా

 

'తనను ప్రేమించి, మోసం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు' అంటూ ప్రియురాలు ప్రియుడి ఇంటిముందు ధర్నా చేయడం కామన్.. కానీ వెరైటీగా, ఓ అమ్మాయి నన్ను ప్రేమించి మోసం చేసింది అంటూ ప్రియుడు ప్రియురాలి ఇంటిముందు ధర్నా చేసాడు.. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగేల్‌లో ఓ యువకుడు, ప్రేమించిన యువతి మోసం చేసిందని ప్రియురాలి ఇంటి ముందు ధర్నా చేసాడు.. అతని ధర్నాకు స్థానిక యువకులు మద్దతు ప్రకటించారు..

మక్లూర్‌ మండలం మాదాపూర్‌కు చెందిన ఎర్రోళ్ల రవి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.. వేల్పూర్‌ మండలం పడిగేల్‌కు చెందిన యువతి, తను పదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పిన అతను, ఆమెతో దిగిన ఫొటోలు చూపించాడు.. అయితే, తన ప్రేమను కాదని, మరో యువకుడితో పెళ్లికి సిద్ధమైందని రవి యువతి ఇంటి ముందు ఆందోళనకు దిగాడు.. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి తీసుకెళ్ళారు.