బోళ్ళ బుల్లిరామయ్య కన్నుమూత

 

ఆంధ్రా షుగర్స్‌ ఛైర్మన్‌, ఎండీ, కేంద్ర మాజీ మంత్రి బోళ్ళ బుల్లిరామయ్య (92) కన్నుమూశారు.  పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని తన స్వగృహంలో ఆయన మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బోళ్ళ బుల్లిరామయ్య 1926, జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాక గ్రామంలో జన్మించారు. 1953 సంవత్సరంలో ఆంధ్రా షుగర్స్‌లో చేరిన ఆయన వివిధ హోదాలలో పనిచేసి ఛైర్మన్‌, ఎండీ స్థాయికి ఎదిగారు. 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన 1984లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.1984, 1991, 1996, 1999 ఎన్నికల్లో కూడా పోటీచేసి గెలుపొందారు. నటుడు కృష్ణ మీద ఒకసారి ఓడిపోయి, మరోసారి గెలిచారు. 1996 నుంచి రెండేళ్ళపాటు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలలో రెండు దశాబ్ధాల పాటు కీలకపాత్ర నిర్వహఇంచారు. బోళ్ళ బుల్లిరామయ్య పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు.