ముంబై శివసేనదే

దేశ వాణిజ్య రాజధాని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో శివసేన దూసుకుపోతోంది. బీజేపీతో నువ్వానేనా అన్నట్లు తలపడినప్పటికి..తర్వాత శివసేనదే పైచేయిగా నిలిచింది..మొత్తం 227 స్థానాలకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ 59 స్థానాల్లో విజయం సాధించగా..మరో 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 35 స్థానాల్లో గెలిచి మరో 38 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. ఆ పార్టీ 17 స్థానాలను కైవసం చేసుకుని మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక శరద్ పవార్ ఎన్సీపీ కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.