బీజేపీకి షాక్... శివసేన తెగదెంపులు..

 

బీజేపీ-శివసేన మిత్రపక్షమైనప్పటికీ అప్పుడప్పుడు బీజేపీపై శివసేన విమర్శలు గుప్పిస్తూనే ఉంటది. అయితే ఇప్పుడు ఏకంగా  ఓ గట్టి షాకే ఇచ్చింది శివసేన. పొత్తు నుండి బయటకు వస్తున్నట్టు తెలిపింది. బీజేపీతో బంధాన్ని శివసేన తెగదెంపులు చేసుకుంది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోరాదని, ఒంటరిగానే పోరాటం చేయాలని శివసేన నిర్ణయం తీసుకుంది. పార్టీ నేత సంజయ్ రౌత్ ఇందుకు సంబంధించి ముంబైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకాభిప్రాయంతో పార్టీ ఆమోదించడం విశేషం.