బాబు చేతిలో బీజేపీ స్కాములు

 

చంద్రబాబు రాజకీయ దిట్ట.. ఆయన ఆలోచనలు, వ్యూహాలు అంత త్వరగా ఎవరికీ అర్థంకావు.. అందుకే కొందరు ఆయన్ని తక్కువంచనా వేస్తారు.. బీజేపీ కూడా అలా తక్కువంచనా వేసే పప్పులో కాలేసింది.. బాబు తన అనుభవాన్ని, అభిమానాన్ని పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో నాలుగేళ్లు కలిసున్నారు.. కానీ బీజేపీ కనికరించలేదు.. ఇక రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక బాబు, బీజేపీకి దూరమయ్యారు.. తర్వాత బాబు తన శైలికి భిన్నంగా దూకుడు పెంచారు.. అయినా బీజేపీ తగ్గలేదు.. ఈసారి ఏపీలో మాదే అధికారమంటూ బాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు మొదలుపెట్టింది.. అప్పుడే బాబు ఆట మొదలైంది.. ఇప్పుడిప్పుడే బాబు వ్యూహాలు ఎలా ఉంటాయో బీజేపీకి అర్థమవుతుంది.

ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రెస్ మీట్ పెట్టారు.. ప్రెస్ మీట్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి మాట్లాడతారనుకున్నారంతా.. కానీ వాటితో పాటు కుటుంబరావు, బీజేపీ గుండెల్లో బాంబు పేల్చేలాంటి మాట చెప్పారు.. కేంద్ర ప్రభుత్వం రెండు భారీ స్కాములు చేసిందని.. వాటిని నెల రోజుల్లో సాక్షాలతో సహా బయట పెడతామని అన్నారు.. దీంతో బీజేపీ ఒక్కసారిగా షాకైంది.. ఇవి తప్పుడు ఆరోపణలని కప్పిపుచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది.. అసలే మోడీ మీద రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతుంది.. దీనికితోడు ఎన్నికలు సమయం దగ్గరికొస్తుంది.. ఈ టైంలో స్కాములు బయటపడితే బీజేపీకి కష్టకాలమే.. అందుకే, స్కాములు బయటపడకుండా ఆచి తూచి అడుగులు వేయాలని చూస్తుంది.. మరోవైపు బాబు విషయంలో తొందరపడ్డామంటూ తలలు పట్టుకుంటుంది.

బాబు వ్యూహాలు అలా ఉంటాయి మరి.. ఏ విషయంలోనైనా ముందు చూపుతో ఆలోచించే బాబు.. మోడీ, అమిత్ షాల గురించి ముందే పసిగట్టి.. స్కాముల వివరాలు సేకరించారు.. ఇప్పుడు వాటినే అస్త్రంగా మలుచుకున్నారు.. తనని ఇరుకున పెట్టాలని చూసినవాళ్లనే ఇరుకున పెట్టారు.. బాబంటే ఏంటో చూపించారు.. బాబుని తక్కువంచనా వేసిన బీజేపీ.. బాబు దెబ్బకి విలవిలలాడుతోంది...