తెలంగాణలో బీజేపీ దారెటు..

 

తెలంగాణలో అన్ని పార్టీలు ఓ క్లారిటీ తో ఉన్నాయి. కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ,టీజేఎస్ ఒక్కటిగా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి మజ్లీస్ మద్దతు పలికింది. కానీ బీజేపీ మాత్రం ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉంది. తాజాగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ టీఆర్ఎస్ కి మద్దతు ఇస్తామని ప్రకటించారు. అది కూడా మజ్లీస్.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేకుంటేనే అని కండీషన్ పెట్టారు. కానీ ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు మాత్రం మా మద్దతు టీఆర్ఎస్ కి లేదు అని ప్రకటించారు. . అయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేది లేదని, తాము ఆ పార్టీకి వ్యతిరేకమని ఆయన వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలమైతే టీఆర్‌ఎస్‌పై పోరాడింది తామేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు ఎలాంటి తీర్పును ఇచ్చినా ఆహ్వానిస్తామన్నారు.

దీంతో అసలు బీజేపీ నేతలు సమన్వయం లేకుండా ఎవరి నిర్ణయాలు వాళ్ళు ప్రకటిస్తున్నారని, బీజేపీ ఎటూ తేల్చుకోలేక ఏకాకిగా మిగలటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో పక్క టీఆర్ఎస్ కూడా బీజేపీ, నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బీజేపీ మాత్రం కాంగ్రెస్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వకూడదనే దృఢ సంకల్పంతో ఉంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో...?  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అన్నది టీఆర్ఎస్,మజ్లీస్,బీజేపీ మరోసారి నిజం చేస్తాయేమో వేచి చూద్దాం..!!