బీజేపీ కి షాక్... ఆనందంలో కాంగ్రెస్..

 

ఈమధ్య ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ పార్టీనే ఘన విజయం సాధించింది. కానీ రాను రాను బీజేపీ పై కాస్త వ్యతిరేకత పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు అది నిజమని తెలుస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజులు తమకు ఎదురులేదని ఎగిరిపడుతున్న బీజేపీకి మధ్యపదేశ్ లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి షాక్ తగిలింది. మధ్యపదేశ్ లో చిత్రకూట్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. అయితే ఈ ఉపఎన్నికలో..కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నిలాంశు చతుర్వేది తన ప్రత్యర్థి అయిన బీజేపీ నేత శంకర్ దయాళ్ త్రిపాఠీపై 14,133 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చతుర్వేదికి 66,810 ఓట్లు రాగా... త్రిపాఠీకి 52,677 ఓట్లు పడ్డాయి. ఈ నెల 9వ తేదీన ఈ ఉప ఎన్నిక జరిగింది. 65 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది.