భాజపా హఠావో.. దేశ్‌ బచావో..

1993లో విక్టోరియా హౌస్ వద్ద జరిగిన కాల్పుల్లో 13 మంది యూత్ కాంగ్రెస్ వర్కర్లు మృతిచెందారు. ఈ ఘటనను పురస్కరించుకుని టీఎంసీ ప్రతి యేటా జూలై 21న ‘‘అమరవీరుల దినోత్సవం’’ జరుపుకుంటోంది. ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన మెగా ర్యాలీలో మమతాబెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శల వర్షం కురిపించారు. మిడ్నాపూర్‌లోని మోదీ సభలో చోటుచేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ,‘టెంట్లనే సరిగ్గా వేసుకోలేనివారు..

 

దేశాన్ని ఎలా నిర్మిస్తారు?’ అని ఎద్దేవా చేశారు. ‘కేంద్రంలో బీజేపీని గద్దె దించి తీరుతాం. అందుకు పశ్చిమ బెంగాల్ ముందుంటుంది. ఇందుకు తృణమూల్ కాంగ్రెస్ ‘భాజపా హఠావో.. దేశ్‌ బచావో’ అనే నినాదంతో ఆగస్టు 15 నుంచి ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది అన్నారు. బీజేపీకి కనీసం 100 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. శుక్రవారం జరిగిన అవిశ్వాసం గురించి మట్లాడుతూ.. ‘ఆ సంఖ్యలన్నీ లోక్‌సభలో మాత్రమే. బయట ప్రజాస్వామ్య దేశంలో భాజపా విజయం సాధించలేదు’ అని అన్నారు. జనవరి 19న దేశంలోని పలు పార్టీల నేతలను ఆహ్వానించి రాష్ట్రంలో మెగా ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మమతా చెప్పారు.