హాల్ టికెట్ పై హాట్ ఫోటో! బీహార్ విద్యార్థినికి భీభత్సమైన షాక్!

 

దేశంలో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు చాలా మంది అసంకల్పితంగానే చెప్పేసే సమాధానం, బీహార్! మన దేశంలో ఇంకా బోలెడు రాష్ట్రాలు వెనుకబాటుతో బాధపడుతున్నా బీహార్ మాత్రం అన్ని రకాల చెడు కారణలతో ఫుల్ గా ఇన్ ఫేమస్ అవుతూ వుంటుంది! రాజకీయాలు మొదలు రికార్డింగ్ డ్యాన్స్ ల వరకూ అన్నిటికీ బీహారే అడ్డా. అక్కడ జరగని అడ్డమైన పనంటూ వుండకపోవటం నిజంగా పెద్ద విషాదం. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో ఘనకార్యం చేరింది!

 

ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ముందు అక్కడి విద్యా వ్యవస్థ బాగుపడాలి. దాని వల్లే ఇవాళ్ల కాకపోయినా రేపైనా సమాజం బాగుపడుతుంది. కాని, బీహార్లో విద్యా వ్యవస్థ అవస్థ చూస్తే దుఃఖంతో పాటూ నిర్లప్తిత కూడా వచ్చేస్తుంది. అంతగా అవినీతి, నిర్లక్ష్యం పేరుకుపోయాయి ఒకప్పటి నలందా ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయానికి కేంద్రమైన బీహార్లో!

 

తాజాగా ఓ అమ్మాయి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఉద్యోగానికి అప్లై చేసుకుంది. అందుకు ఆమెకు పరీక్ష రాయటానికి అధకారులు హాల్ టికెట్ జారీ చేశారు. కాని, అసలు బీహారీ ట్విస్ట్ ఇక్కడే ఇచ్చారు సదరు మహా నిజాయితీపరులైన ప్రభుత్వ ఉద్యోగులు. హాల్ టికెట్ పై విద్యార్థిని ఫోటో కాకుండా హీరోయిన్ ఫోటో అచ్చేశారు. అక్కడితో వారి రసికతో చల్లారలేదు. ఆ ఫేమస్ హీరోయిన్ గారి టాప్ లెస్ ఫోటో వేశారట ప్రబుద్ధులు! తన ఫోటోకి బదులు హీరోయిన్ నగ్న చిత్రం చూసి అవాక్కైంది అమాయక విద్యార్థిని! మెల్లగా ఈ విషయం ఓ హిందీ పత్రిక కథనం ద్వారా సోషల్ మీడియాకు చేరి రచ్చ రచ్చగా మారింది. కాని, ఇంత వరకూ నీతీష్, లాలూ ప్రసాద్ ల భీభత్స బీహార్ లో ఏ ఒక్క అధికారి దీనిపై స్పందించలేదు!

 

కొన్ని నెలల క్రితమే బీహార్లో పెద్ద మార్కుల కుంభకోణం జరిగింది. అక్కడ జరిగిన ప్రభుత్వ బోర్డ్ ఎగ్జామ్స్ లో టాపర్స్ గా నిలిచిన వారు కనీసం ఏ సబ్జెక్ట్ లో ఏముంటుందో కూడా చెప్పలేకపోయారు. పొలిటికల్ సైన్స్ లో వంటల గురించి నేర్పించారంటూ టీవీ ఇంటర్వ్యూలో చెప్పి అడ్డంగా బుక్కైపోయారు. తరువాత జరిగిన దర్యాప్తులో ఎంతో మంది సీనియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ అఫీషియల్స్ అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది!

 

డబ్బులు తీసుకోని పేపర్ లీక్ చేయటం మొదలు హాల్ టికెట్ పై బూతు బొమ్మలు అచ్చేయటం వరకూ బీహార్ విద్యాశాఖ లీలలు ఒక్క రకం కాదు. ఒకప్పడు దేశదేశాల నుంచి విద్యార్థులు వచ్చిన నలంద ప్రాంతంలోనే ఇప్పుడు తప్పుడు బొమ్మతో హాల్ టికెట్ అందుకున్న అభాగ్యురాలు వుంటోంది. ఇదే బీహార్ దారుణమైన పతానానికి, మన వ్యవస్థలోని లోపానికి ప్రత్యక్ష నిదర్శనం!