చంద్రబాబుకి నెం 16తో షాక్ ఇవ్వనున్న గంటా...!


2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తోంది. చంద్రబాబు కుటుంబంతో యూరోప్ పర్యటనకి వెళ్ళగానే అనేక నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు నిన్న బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇది జరిగి 24 గంటలకు కూడా గడవక ముందే టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈసారి మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి భారీ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం.

మాజీ మంత్రి ప్రస్తుత విశాఖ ఉత్తర శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు, మరో 15 మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో జాయిన్ అవుతున్నారని సమాచారం. ఈరోజు వీరంతా బీజేపీలో చేరబోతున్నారట. ప్రస్తుతం వీరంతా శ్రీలంకలో ఉన్నారట. వారంతా శ్రీలంక నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. గతంలో టీడీపీ నుంచి పీఆర్పీలోకి వెళ్లిన గంటా శ్రీనివాసరావు ఆ పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేసినప్పుడు మంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీ లో చేరి భీమిలి నుంచి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందాడు. ఇక ఇప్పుడు టిడిపిలో నుంచి ఒక పదిహేనుమంది శాసన సభ్యులతో బీజేపీలోకి చేరబోతున్నట్లు సమాచారం.

ఒకవేళ ఇదే జరిగితే అసెంబ్లీలో టీడీపీ ప్రతిపక్ష హోదా కోల్పోతుంది, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి హోదాను కోల్పోతాడు. ఇప్పుడు ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది సస్పెన్స్‌గా మారింది.