ప్రాధాన్యత ఇవ్వని పార్టీలో నేను ఉండను :- దేవినేని అవినాష్

తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగు దేశం పార్టీని వీడుతున్నారు. అభిమానులు.. అనుచరులతో.. జరిగిన సమావేశంలోఇవాళ సాయంత్రం ( నవంబర్ 14న ) ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తన   నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబుకు విధేయుడు గా ఉన్నప్పటికీ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని అవినాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో టిడిపి తరుపున గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చెంది తర్వాత రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు దేవినేని అవినాష్. ఇటీవల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరమంటూ ఆయనకు ఆహ్వానం అందింది.

గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానాన్ని వైసిపి కోల్పోవటంతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా ఓడిపోయింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అతి తక్కువ మెజారిటీతో గెలు పొందడంతో పార్టీకి విజయవాడలోని ప్రధాన సామాజికవర్గ అండదండలు లేవని నిర్ణయానికి వచ్చారు సీఎం జగన్. దేవినేని కుటుంబం నుంచి దేవినేని అవినాష్ ను తమ వైపుకు రావలసిందిగా కీలక వ్యక్తుల ద్వారా సమాచారం పంపారు. ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ కూడా అవినాష్ ను తన పదవిలో కొనసాగించమనే కోరింది. అయితే తనకు నియోజక వర్గ బాధ్యతలు అప్పగించకుండా ఎన్నికల సమయంలో తమను ట్రబుల్ షూటర్ గా ఉపయోగించుకోవటం పట్ల అవినాష్ చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.తమ కుటుంబానికి అనుచరులు.. అభిమానులు.. ఉన్న విజయవాడ తూర్పు లేదా పెనమలూరు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి తనకు కేటాయించాలని కోరారు. అదే విధంగా తూర్పు నియోజకవర్గంలో నగరంలో తమ అనుచరులకు కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు కేటాయించి అంశంపై కూడా పార్టీ నుంచి తగిన హామీ లభించలేదని అవినాష్ అనుచరులు చెబుతున్నారు.

పార్టీలో చంద్రబాబు చెప్పిన మాట వింటూ ఉన్నప్పటికీ తమకు ఎటువంటి ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వడం లేదని  నిన్న ( నవంబర్ 13న )  జరిగిన పార్టీ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు అవినాష్ అనుచరులు.