పెళ్లిపీటలు ఎక్కబోతున్నఅఖిల ప్రియ... అసలు కథ ఇదే..

 

ఏపీ మంత్రి, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వరుడు ఎవరో కాదు... మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు, మంత్రి నారాయణ దగ్గరి బంధువు భార్గవ్‌తో మంత్రి అఖిలప్రియకు నిశ్చితార్థమైంది. హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో అఖిలప్రియ, భార్గవ్‌ల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. గతకొంతకాలంగా అఖిలప్రియ, భార్గవ్‌లు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది.

 

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కొడుకుతో గతంలో అఖిల ప్రియకు పెళైన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అఖిలప్రియ మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ కు ఐదేళ్ల ప్రేమాయణం నడిపింది. అఖిల ప్రియ మంత్రిగా ఉండగానే భార్గవ్ తో చనువుగా ఉండటం.. ఇక భార్గవ్ కూడా నేరుగా అఖిల ప్రియ ఛాంబర్ కే వచ్చి కూర్చోవడం... అక్కడి నుండే అన్ని వ్యవహారాలు నడిపించడం... ఇక ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఆయన కూడా చీవాట్ల పెట్టడం అన్నీ జరిగాయి. ఇక భార్గవ్ కూడా విడాకులు తీసుకోకుండా అఖిల ప్రియతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటంతో సాంబశివరావు హెచ్చరించినా భార్గవ్ మారకపోవడంతో సాంబశివరావే దగ్గరుండి విడాకులు ఇప్పించారట. దీంతో లైన్ క్లియర్ అవ్వడంతో ఇద్దరూ ఒకటయ్యారు. ఈ నేపథ్యంలో ఇరువురి నిశ్చితార్థ వేడుకను కుటుంబ సభ్యులు జరిపించగా.. ఆగస్టు 29న అఖిలప్రియ, భార్గవ్‌ల వివాహం జరుగనున్నట్టు సమాచారం.