'బీర్ గాగుల్స్'తో డైటింగ్

 

 

 

సన్నబడాలంటే డైటింగ్ చెయ్యాలి, కాని రకరకాల రుచి గల ఆహారం కనిపిస్తే నోరుకట్టుకోవడం కొంచం కష్టమే అదిగో అలాంటి వల్ల కష్టాలని తగ్గించడానికి 'బీర్ గాగుల్స్ 'ని తయారుచేసింది. విషయం ఏంటంటే రంగులు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని,మానసికోద్వేగాల్ని ప్రేరేపిస్తాయని అందరికీ తెల్సిందే అయితే నీలిరంగు అస్సలు ఆకలిని కలిగించదట! అందుకని నీలిరంగులలో ఈ బీర్ గాగుల్స్ ని తయారుచేశారు. ఇవి పెట్టుకుని ఏదయినా తినటం మొదలుపెడితే కాస్త తినేసరికి ఆకలి చచ్చిపోతుందట! ఎందుకంటే ఈ గాగుల్స్ తయారుచేసినవారి సమాధానం ఏంటో తెలుసా ? మనం తినే ఆహారాన్ని ఆకలి తీర్చుకోవటం కంటే దాన్ని ఆకర్షణతో ఎక్కువ తింటా౦మట - రంగు,వాసన,రుచి అన్ని మన ఆకలిని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఆహారం నీలిరంగులో కనిపిస్తుంటే ఆకలి కూడా మందగిస్తుందట...దాంతో తక్కువ తింటారు అంటున్నారు వీళ్ళు. బావుంది మనసుని కట్టడి చేయాలి కాని కళ్ళనెందుకు ? అంటారా ? డైటింగ్ చేయాలనే సంకల్పం ఎంత వీక్ గా ఉంటె అన్ని ప్రయత్నాలు చెయ్యాలి మరి..

......రమ