రాహుల్ ను తిట్టినందుకు..పార్టీ నుండి బహిష్కరణ..

 

దిల్లీ కాంగ్రెస్‌ మహిళా విభాగ అధ్యక్షురాలు బర్ఖా శుక్లాసింగ్‌..కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహులు గాంధీ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమెపై వేటు పడింది. ఆమెను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. క్రమశిక్షణ చర్యల కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కాంగ్రెస్‌ను నడిపించే నాయకత్వ లక్షణాలు ఆయనలో లేవని, అధ్యక్షుడి బాధ్యతలకు ఆయన మానసికంగా సరిపోరని బర్ఖాసింగ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాదు కాంగ్రెస్‌ దిల్లీ అధ్యక్షుడు అజయ్‌ మేకన్‌పై కూడా బర్ఖాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మహిళ నేతలతో ఆయన అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దీనిపై రాహుల్‌ సహా.. పార్టీ సీనియర్‌ నేతలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.