జగన్, బాలకృష్ణ కలయిక అదిరిందిగా..!!

 

జగనేమో ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత.. ఇక బాలకృష్ణ స్టార్ హీరో కమ్ అధికార పార్టీ ఎమ్మెల్యే.. మరి వీరిద్దరి కలయిక ఏంటబ్బా అనుకుంటున్నారా.. ఒక అభిమాని వీరిద్దర్నీ కలిపేసాడు లేండి.. ప్రస్తుతం జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.. ఈ పాదయాత్ర సందర్బంగా ఒక అభిమాని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూసి, అందరూ షాక్ అవుతున్నారు.. ఒకవైపు జగన్ ఫోటో, మరోవైపు బాలకృష్ణ ఫోటో ఉంటే షాక్ అవ్వరా ఏంటి?.. అసలు ఫ్లెక్సీ వెనక కథ ఏంటంటే.. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అతను రాజకీయాల్లో జగన్ కి, సినిమాల్లో బాలకృష్ణకి అభిమానట.. ఆ అభిమానం కాస్త అలా ఫ్లెక్సీలో చూపించాడు.. ఈ అభిమాని ఎవరో కాని తన అభిమాన రాజకీయనాయకుడు జగన్, అభిమాన కథానాయకుడు బాలకృష్ణ ఫోటోలు ఒకే ఫ్లెక్సీలో వేసి.. అభిమానులందు ఈ అభిమాని వేరయ్యా అనిపించుకుంటున్నాడు...