అచ్చెన్నాయుడుకి కరోనా పాజిటివ్

ఈఎస్ఐ కేసులో అరెస్టై, జ్యుడీషియాల్ రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడుకి రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, రెండు రోజుల నుంచి జలుబు చేయటంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో హాస్పిటల్ యాజమాన్యం, ఈ విషయం హైకోర్టుకు సమాచారం అందించింది. అయితే దీనిపై తమకు అధికారికంగా ఒక లేఖ ద్వారా ఈ విషయం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. 

 

కాగా, ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పైల్స్ ఆపరేషన్ జరిగింది అని చెప్పినా.. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు దాదాపు 600 కిమీ కారులో తిప్పటంతో ఆయనకు బ్లీడింగ్ ఎక్కవై ఆపరేషన్ ఫెయిల్ అవ్వటంతో, మరో సారి ఆపరేషన్ చేసారు. ఇదంతా ఆయన జ్యుడీషియాల్ రిమాండ్ లో ఉండగానే జరిగింది.అయితే దీని పై మొదటి నుంచి టీడీపీ అభ్యంతరం తెలిపింది. ఇలా ఇష్టం వచ్చినట్టు తిప్పితే, ఈ పరిస్థితిలో కరోనా లాంటివి వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను గుంటూరు జీజీహెచ్ నుంచి, విజయవాడ సబ్ జైలుకు తీసుకు రావటంపై కూడా టీడీపీ అభ్యంతరం చెప్పింది. ఇదే సమయంలో ఆయనకు రెండు ఆపరేషన్ లు జరిగాయని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టులో కేసు వేయడంతో ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్ళటానికి కోర్టు అనుమతించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.