ఉభయ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదు

 

ఉభయ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా రాజ్యసభలో టీడీపీ ఎంపీ సుజనా చౌదని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగారాం ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాజ్యాంగంలోని 170 (3)వ ఆర్టికల్ ప్రకారం 2026 తర్వాత సేకరించే తొలి జనాభా లెక్కల ప్రకారమే అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ స్థానాల పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఏపీలో 175 నుంచి 225కు, 119 నుంచి 153కు పెంచాలని పొందుపరిచారు. మరోవైపు విభజన చట్టంలోని 12వ షెడ్యూల్‌ అంశాలన్నీ దాదాపు అమలులోకి తెచ్చామని గంగారాం స్పష్టం చేశారు. ఈ మేరకు మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు గంగారాం సమాధానమిచ్చారు.