పాత మాటే మళ్లీ చెప్పిన జైట్లీ...

 

ప్రత్యేక హోదా ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఇవ్వడంలేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఏపీకి ఇష్టంలేని విభజన జరిగింది..ఏపీ ఆదాయాన్ని కోల్పోయింది. ప్రత్యేక హోదా ఉంటే ఏమొస్తుంది... దేశంలో మిగతా రాష్ట్రాలు ఎలాగో.. ఏపీ కూడా అంతే... అయినా ఏపీతో సంప్రదించాక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం అని అన్నారు. నేను ఏపీ పట్ల సానుకూలంగా ఉన్నాను.. ప్రత్యేక హోదాకి సమానంగానే సాయం అందిస్తున్నాం.....స్టేటస్ అనే మాట వాడకుండానే సాయం అందిస్తున్నాం...ఇది హోదా ప్రయోజనంతో సమానం... కోన్ని రోజుల పాటు రెవెన్యూ లోటు భర్తీ చేస్తాం.. విదేశీ సాయాన్ని కూడా 90-10% కేంద్రమే భరిస్తుందని ప్యాకేజీలో చెప్పాం.. ఏపీకి పన్ను మినహాయింపులు ఇస్తే వేరే రాష్ట్రాలు కూడా అడుగుతాయి.. అని చెప్పుకొచ్చారు.