అమరావతి నిర్మాణంపై అరుణ్ జైట్లీ...

 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటిలాగానే ఈ సమావేశాల్లో భాగంగా... అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి గాను కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి రూ. 3,324 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరిందని...రుణం ఇచ్చే అంశాన్ని ప్రపంచ బ్యాంకు పరిశీ లిస్తోందని చెప్పారు. సంప్రదింపులు పూర్తి అయిన వెంటనే రుణం మంజూరవుతుందని తెలిపారు. అంతేకాదు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 1500 కోట్లు ఇచ్చిందని చెప్పారు.