మరో మార్పుకు కేంద్ర ప్రయత్నం..

 

ఎన్డీయే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పెద్ద నోట్ల రద్దు చేసింది.. ఆ తరువాత జీఎస్టీ.. అంతకు ముందు ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి సైతం స్వస్తి పలికి రైల్వే బడ్జెట్ ను కలిపి అంతా ఒకే బడ్జెగా మార్చారు. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరంలో మార్పులు చేయాలని భావిస్తోంది. ఇక నుంచి గతంలో మాదిరిగా ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్‌ నుంచి మార్చి కాకుండా జనవరి నుంచి డిసెంబర్‌కు లెక్కగట్టాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటు లోక్‌సభలో ప్రకటించారు. 'ఆర్థిక సంవత్సరం మార్పు అంశం ప్రస్తుతం పరిగణనలో ఉంది' అని ఆయన తెలిపారు.