గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 1,26,728 ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 21.5లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తిచేసిన 10 రోజుల్లోనే ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30, అక్టోబర్‌ 1న శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 2న అభ్యర్థులు విధుల్లో చేరనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15వేల చొప్పున జీతం ఇవ్వనున్నారు. ఈ ఫలితాలను http://gramasachivalayam.ap.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.