ఆందోళనకరంగా అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిల ఆరోగ్యం....

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత ఆరు రోజులుగా వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే సీనియర్ ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ ల ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు తాజాగా  యువ ఎంపీలైన వైయస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిల ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో రామ్ మనోహర్ లోహియా ఆసుప్రతి వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. బీపీ, షుగర్ లెవెల్స్, పల్స్ రేటు పడిపోయాయని.. సమయం గడిచే కొద్దీ వీరి ఆరోగ్యం మరింత విషమిస్తుందని చెప్పారు.