రేవంత్ రెడ్డి సమాధానం చెబుతాడా..?


ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్  ఏంటంటే... ఎపీ టీడీపీ నేతలపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించే. రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఏపీ టీడీపీ నేతలపై కూడా పలు కామెంట్లు విసిరాడు. ఇక రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ టీడీపీ నేతలు... ఆయన రివర్స్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. ఇలాంటి వేడి వాతావరణంలోనే టీడీపీపీ పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేశారు ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దీంతో ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి వస్తారా...? రారా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

 

కానీ అసలే డేరింగ్ ఎక్కువైన రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి వచ్చి అందరికి షాకిచ్చారు. అసలు ఈ సమావేశం పెట్టిందే..  రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారన్న ప్రచారంపై ప్రధానంగా చర్చించేందుకు. అయితే ఈ చర్చకు రేవంత్ రెడ్డి రాకపై డౌట్లు వచ్చాయి. కానీ రేవంత్‌ సైతం ఈ సమావేశానికి హాజరై..  తెలంగాణ టీడీపీ నేతలు షాకిచ్చారు. అంతేకాదు..ఈ సమావేశానికి హాజరైన వారిలో ఎక్కువమంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ సమావేశంలో.. రేవంత్ రెడ్డి  పార్టీ మార్పు విషయంలో నిజముందా..? కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలిశాడా..? ఏపీ టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలుపై వివరణ..? పలు అంశాలపై రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వాల్సి రావచ్చన్న వాదన వినిపిస్తోంది. మరి ఇంతకీ ఈ సమావేశంలో ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.