ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఉన్న స్థానాలకు గాను మూడు రోజుల క్రితం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది.

 

 

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై తెదేపా అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 56 ఓట్ల తేడాతో గెలుపొందారు.

 

 

కడప స్థానిక సంస్థల ఎన్నికల స్థానాన్ని తెదేపా కైవసం చేసుకుంది. తెదేపా అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్‌ రవి)... వైకాపా అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో తెదేపాకు 433 ఓట్లు రాగా.. వైకాపాకు 399 ఓట్లు వచ్చాయి.

 

నెల్లూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన వాకాటి నారాయణ రెడ్డి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిపై 85 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.