అసెంబ్లీలో కొత్త పదం ‘జగనోక్రసీ’

 

అప్పుడప్పుడు రాజకీయాల్లో కూడా కొత్త కొత్త పదాలు పుడుతూ వుంటాయి. తాజాగా ‘జగనోక్రసీ’ అనే కొత్తపదం పుట్టింది. ఈ పదాన్ని ఏపీ అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు ఉపయోగించారు. రాజధాని ప్రకటనకు ముందే చర్చ జరగాలని జగన్ సభలో పట్టుబట్టడంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల ‘‘శాసనసభలో ‘డెమోక్రసీ’ మాత్రమే నడుస్తుంది ‘జగనోక్రసీ’ నడవదు’’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అయినా, ప్రతిపక్ష నాయకుడైనా సభ నియమాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయం చేయడం కోసం ఈ అంశం మీద జగన్ హడావిడి చేస్తున్నారని అన్నారు. దాంతో ‘జగనోక్రసీ’ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేతను అవమానించే విధంగా అసెంబ్లీలో మాట్లాడటం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే జోతుల నెహ్రు పేర్కొన్నారు. జగన్‌కి అధికార పక్ష సభ్యులు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.