జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్..

ఏపీలోని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి జరిగిన భూసేకరణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించొద్దని ఆదేశించింది. మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుందని హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల ఇళ్ల పట్టాల కోసం మైనింగ్ భూములను కేటాయించారని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు దీనిపై స్టే ఇస్తూ ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

కాగా, ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరో సారి వాయిదా పడింది. ఈ విషయంలో కోర్ట్ లో కేసులు నడుస్తున్న నేపథ్యంలో వాయిదా పడిందని తెలుస్తోంది.