కేంద్రంలో బీజేపీనే కానీ ఏపీలో వైసీపీ కాదు.. టుడేస్ చాణక్య

 

దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో ఎన్డీయేనే అధికారంలోకి వస్తాయని అంచనా వేశాయి. 'టుడేస్ చాణక్య' సర్వే కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్డీయే కూటమికి 350 సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేసింది. ఇక యూపీఏ కూటమి వంద సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది.

 

 

అయితే ఏపీలో మాత్రం 'టుడేస్ చాణక్య' సర్వే అంచనాలు భిన్నంగా ఉన్నాయి. మెజారిటీ సంస్థలు ఏపీలో వైసీపీదే హవా అని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 'టుడేస్ చాణక్య' మాత్రం ఏపీ లోక్ సభ ఎన్నికల్లో టీడీపీదే హవా అని అంచనా వేసింది. టీడీపీ 14 నుంచి 20 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశముందని, ఇక వైసీపీ 5 నుంచి 11 సీట్లు గెలిచే అవకాశముంది అభిప్రాయపడింది.

 

 

ఇక తెలంగాణ విషయానికొస్తే అన్ని సంస్థలు చెప్పినట్లే  'టుడేస్ చాణక్య' కూడా టీఆర్ఎస్ జోరు కొనసాగుతుందని వెల్లడించింది. టీఆర్ఎస్ 12 నుంచి 16 ఎంపీ సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేసింది.