దగ్దమైన కారు...ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం...


ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం ఒక్కసారిగా దగ్గమైంది. వివరాల ప్రకారం...  చినరాజప్ప  సీఎం చంద్రబాబు టూర్ కోసం విశాఖ నుంచి నర్సీపట్నం వెళుతున్నారు. అయితే మాకవరపాలెం వద్ద  కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం ఒక్కసారిగా దగ్ధమైంది. కారులో నుంచి మంటలు చెలరగడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వెనకు ఉన్న కారులను ఆపడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో చినరాజప్పకు ఏమీ కాకపోవడంతో అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. అయితే దగ్గదమైన కారులో ఎవరైనా ఉన్నారా..? కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.