లోకేష్ సీఎం.. చంద్రబాబు పీఎం ...

 

టీడీపీ మీద, బాబు మీద విమర్శలు చేస్తున్న బీజేపీ రోజురోజుకి ఆ విమర్శల డోస్ పెంచుకుంటూ వస్తుంది.. తాజాగా, ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మరొక్కసారి టీడీపీని, బాబుని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసారు.. నవ నిర్మాణ దీక్షల పేరుతో బాబు, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.. అలానే, కేంద్ర పథకాలను టీడీపీ ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటుంది అంటూ మండిపడ్డారు.. అంతేనా 2014 ఎన్నికల టాపిక్ కూడా తీస్కోచ్చారు వీర్రాజు.. అసలు ఆ ఎన్నికల్లో బీజేపీ, జనసేన వల్లే తెలుగుదేశం గెలిచి అధికారంలోకి వచ్చింది అన్నారు.. అలానే 2019 ఎన్నికల టాపిక్ కూడా తీస్కోచ్చారు.. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ని సీఎం చేసి, బాబు పీఎం కావాలని ఆశపడుతున్నారంటూ ఆరోపించారు.

మోడీ పీఎం కావాలని ప్రజలు కోరుకున్నారని.. చంద్రబాబు పీఎం కావాలని ఎప్పుడూ, ఎవరూ కోరుకోలేదని విమర్శించారు.. బాబువి కుట్రపూరిత రాజకీయాలని.. మిత్రపక్షంగా ఉన్నపుడు కూడా బీజేపీ గెలుపుకి ఎప్పుడూ సహకిరించలేదని మండిపడ్డారు.. అలానే కాంగ్రెస్, టీడీపీల పొత్తు గురించి మాట్లాడిన వీర్రాజు.. టీడీపీ, కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమైంది అందుకే బీజేపీ మీద విమర్శలు చేస్తుందని అన్నారు.. సోము వీర్రాజు విమర్శలకు జవాబుగా కొందరు టీడీపీ నేతలు.. బాబు పీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారని.. రాష్ట్ర ప్రయోజాల కోసమే ఇక్కడ ఉన్నారని చెప్తున్నారట.. అలానే టీడీపీ మీద ఇన్ని విమర్శలు చేస్తున్న వీర్రాజు.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మాటిచ్చిన బీజేపీ.. తరువాత ఆ మాట తప్పిన విషయాన్ని గుర్తుతెచ్చుకుంటే మంచిది అని కొందరు టీడీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారట.