లీకేజ్ పై అసెంబ్లీలో రచ్చరచ్చ..

 

నిన్న మొన్నటి వరకూ అగ్రిగోల్డ అంశంపై అధికారపక్ష, విపక్ష నేతలు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ అసెంబ్లీ అట్టుడికిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు తీర్మానం ఇవ్వగా..  ముందుగా ప్రశ్నోత్తరాల సమయం చేపడదామని, ఆ తర్వాత వేరే ఫార్మాట్‌లో దానిపై చర్చిద్దామని దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీనికి గాను ఆగ్రహం చెందిన వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. లీకేజిల ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ మండిపడ్డారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.