రాజకీయ శాసనసభ

Publish Date:Jun 22, 2013

.....సాయి లక్ష్మీ మద్దాల

 

AP Assembly Meetings, AP Assembly news, AP Assembly congress, congress tdp

 

 

మొత్తం మీద శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసి అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 20 రోజులపాటు జరిగిన శాసనసభ సమావేశాలలో ప్రజాసమస్యలు పక్కదారి పట్టినాయి. 294 మంది సభ్యులలో సభకు హాజరైనది ఎంత మంది. ఈసారి శాసనసభ సమావేశాల కోసం వినియోగించిన సమయం అక్షరాల 57 గంటల 29 నిముషాలు. ప్రజాసమస్యల మీద సభలో గళమెత్తవలసిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఒకసారి బడ్జెట్ సమావేశాల సమయంలో పాదయాత్ర లో మరోసారి సమావేశాలలో అమెరికా యాత్రలో బిజీగా ఉన్నారు. ఉన్న కొద్దిమంది తే.దే. పా ఎం.ఎల్.ఎ లకు కళంకిత మంత్రుల మీద ఎదురుదాడి చేయటమే సరిపోయింది. అందులో ప్రజావాణి ఎందరిది?విమర్శల గోల ఎవరిదో?ప్రజలకు అర్ధంకాని పరిస్థితి. పార్టీల ఎజెండాలో ప్రజాసమస్యలు ఎక్కడా చర్చకు రాలేదు. ఆరంభసూరత్వంగా చర్చలు మిగిలినాయి.

 

విపక్షాల వాకౌట్లు,నిరసనలు,సస్పెన్షన్లతోనే  సభాసమయాన్ని పూర్తిగా వృధా చేశారు. కేవలం బిల్లుల ఆమోదం కోసమే సభా నిర్వహణ జరిగిందా?16 బిల్లులు,8 పద్దులకు సభ ఆమోదం లభించింది.ఆకోవలోనే ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదం పొందింది. కొన్ని సందర్భాలలో అధికారపక్ష  నేతలు,మంత్రులు కొందరు లేకుండానే బిల్లుల ఆమోదం జరిగిపోయింది. నిభందనల మేరకు శాసనసభ కనీస సమయం 144 గంటలు. కాని ఈ  57 గంటల సమయాన్ని వెచ్చించి మాత్రం ముఖ్యమంత్రి,ఆయన సహచర మంత్రులు ఏమి సాధించారు?