మూడో స్థానంలో ఏపీ.. ఆరో స్థానంలో తెలంగాణ

 

తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం, ఏపీలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రచార అస్త్రం 'జాబు రావాలి అంటే బాబు రావాలి'.. ఈ మాట ప్రజల్లోకి బాగా వెళ్ళింది.. ప్రజలు కూడా అనుభవం, తెలివితేటలున్న బాబు సీఎం అయితే 'యువతకి ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది' అని నమ్మి బాబుని గెలిపించారు.. మరి బాబు ఈ నాలుగేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా?.. ఈ ప్రశ్న ప్రతిపక్షాలను అడిగితే బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదు అంటూ జోకులేస్తారు.. లేదా యువతకి ఉద్యోగాలు కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం అయిందంటూ ఆరోపిస్తుంటారు.. కానీ ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలే అని తెలుస్తుంది.

గడిచిన నాలుగేళ్లలో ఉద్యోగాల కల్పనలో ఏపీ మూడో స్థానంలో ఉంది.. ఇది ఏపీ ప్రభుత్వం చెప్పిన లెక్కలు కాదు.. లోక్ సభలో కేంద్రమంత్రి చెప్పిన లెక్కలు.. ఉద్యోగాల కల్పనలో కర్ణాటక, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉండగా ఏపీ మూడో స్థానంలో ఉందట.. తరువాతి రెండు స్థానాల్లో గుజరాత్, తమిళనాడు ఉండగా తెలంగాణ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నట్టు తెలుస్తుంది.. ఏపీ మూడో స్థానంలో ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం రాజధాని, సరైన వసతులు కూడా లేని ఏపీలో ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పించి బాబు తానేంటో నిరూపించుకున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు..మరి కొందరైతే 'జాబు రావాలి అంటే బాబు రావాలి' అనే మాటను బాబు నిజం చేసారుగా అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.