ఆ విషయంలో ఏపీ టాప్ అట !

 

దేశంలోనే ఏపీ టాప్ వన్ స్థానంలో నిలిచింది. దేనిలోనో అనుకునేరు దంపతులు ఎక్కువగా ఉన్న రాష్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. ఇండియా మొత్తం శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే 2017 చేసిన ప్రకారం ఏపీ తర్వాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్ నిలిచాయి. ఈ విషయంలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలుశాఖ రెండు రోజుల కిందట ఈ వివరాలను విడుదల చేసింది. 

దేశ జనాభాలో మొత్తం 46.8 శాతం మంది వివాహితులుండగా అన్ని రాష్ట్రాల కంటే అధికంగా 54 శాతం మంది దంపతులతో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురుషుల్లో 52.5 శాతం మంది, మహిళల్లో 55.6 శాతం మంది వివాహితులు కాగా, తెలంగాణలో 48.1 శాతం పురుషులు, 52.1 శాతం మంది మహిళలు వివాహం చేసుకున్నారు. దేశంలోనే అత్యల్పంగా బిహార్‌ జనాభాలో 41.2 శాతం మంది మాత్రమే వివాహితులు కావడం విశేషం. సర్వేలో భాగంగా మొత్తం 7.9 మిలియన్ల మంది నుండి శాంపిల్‌ తీసుకుని చేపట్టారు.