పాకిస్తాన్ వెళ్లి భారత్ పై పోరాటం చెయ్.. రాజీనామా చేసిన ఐఏఎస్ పై మండిపడ్డ బీజేపీ ఎంపీ

 

ఇటీవల కొంత మంది ఐఏఎస్ అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. కొంత మంది తమ రాజీనామాకు వ్యక్తిగత కారణాలే కారణమని తెలుపగా మరి కొంత మంది  ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. తాజాగా కర్ణాటక లో ప్రభుత్వం తీరుతో విసుగు చెంది తన ఉద్యోగానికి రాజీనామా చేసిన దక్షిణ కన్నడ జిల్లా అధికారి గా పని చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ శశికాంత్ సెంథిల్ పాకిస్థాన్ వెళ్లి భారత్ మీద పోరాటం చెయ్యాలని, అదే ఆయనకు కరెక్ట్ అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే వివాదస్పాద వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండడానికి బదులు పాకిస్థాన్ వెళ్లిపోవాలని, అక్కడ అయన నీతి నిజాయితీ నిరూపించుకోవాలని శశికాంత్ సెంథిల్ కు ఎంపీ సూచించారు. పాకిస్తాన్ లో ఐతే ఆయనకు మద్దతు ఇచ్చే వాళ్లు చాల మంది ఉంటారని తాను భావిస్తున్నానని బీజేపీ ఎంపీ అన్నారు. పాకిస్థాన్ తో కలిసి భారత్ మీద పోరాటం చెయ్యడం నీకు సరైన ఉద్యోగం అని భావిస్తున్నట్లు బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేకపోతే మౌనంగా ఇంట్లో ఉండాలని, ఇలా ప్రభుత్వాల మీద ఆరోపణలు చెయ్యడం మంచిదికాదని ఆ ఐఏఎస్ అధికారికి హెగ్డే సూచించారు. భారత్ మీద పోరాటం చెయ్యాలంటే నీకు పాకిస్థాన్ సరైన చోటు అని హెగ్డే వ్యంగంగా ట్వీట్ చేశారు.