హిమదాస్ కు సాయం చేయడానికి నేను సిద్ధం

ప్రపంచమంతా నిన్ను ఒంటరిని చేయడానికి ప్రయత్నించినా నువ్వు పోరాడటం ఆపకు.. ఒక్కసారి గెలుపు నీకు తోడైతే ప్రపంచమే నీ వెంట పరుగెడుతుంది.

 


హిమదాస్.. మొన్నటి వరకు ఈ పేరు తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పేరు వింటే గర్వ పడుతున్నారు.. ప్రపంచ అండర్-20 ఛాంపియన్‌‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌ని 51.46 సెకన్ల టైంలో ముగించి, హిమదాస్ స్వర్ణపతకం సాధించింది.. దీంతో ఆమెకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి.. తన పేదరికాన్ని, కష్టాలను జయించి పరుగెత్తి విజేతగా నిలిచి.. స్వర్ణ పతకంతో పాటు కొన్ని కోట్ల మనస్సులు గెలుచుకుంది.. ఇప్పుడు ఆమెకి సహాయం చేయడానికి చాలామంది ముందుకొస్తున్నారు.

 

 

తాజాగా మహీంద్రా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, హిమదాస్ కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.. 'ఇప్పుడు ప్రతీ ఒక్కరికి ఆమెను ఒలింపిక్ పోడియంపై చూడాలని ఉంది.. రాజ్యవర్ధన్ రాథోర్ మరియు అథ్లెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమెకు సరైన ట్రైనింగ్ ఇచ్చేందుకు ఆసక్తిగా, సిద్ధంగా ఉన్నారు.. ఒకవేళ ప్రభుత్వ నిధులే కాకుండా, ఆమెకు ఎటువంటి ఆర్థిక సహాయం కావాల్సి వచ్చినా  సాయం చేసేందుకు నేను ఎప్పుడు సిద్ధమే' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు.