విషమంగా ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్యం..


టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తరువాత మరింత మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని 'కిమ్స్‌’కు తరలించారు. ప్రస్తుతం ఇక్కడే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్టు తెలుస్తోంది.  చికిత్సకు ఆయన శరీరం స్పందించడం లేదని తెలుస్తోంది. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.