ఇలాంటి ప్రతిపక్షం ఉండటం మా లక్ అంటున్న అమిత్ షా

 

 

ఇలాంటి పార్టీలో మేం ఉండటం మా లక్ అని సొంతం పార్టీ నేతలు చెప్పుకోవడం చూసాం.. కానీ ఇలా అధికార పార్టీ నేత అయ్యుండి, ఇలాంటి ప్రతిపక్షం ఉండటం మా లక్ అని చెప్పటం కాస్త కొత్తగా ఉంది కదా.. దీని వెనక చిన్నకథ ఉందిలేండి.. ఈ మధ్య జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం.. ఆ ఫలితాలని చూసి కాంగ్రెస్ ఆనందపడటం తెల్సిందే.. అయితే కాంగ్రెస్ ఆనందానికి అడ్డుకట్ట వేయటానికి అమిత్ షా ఒక కౌంటర్ వేశారు.. అదేంటంటే.. చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయినా కూడా, కేవలం కొన్ని ఉపఎన్నికల ఫలితాలు చూసి ఆనందపడే ప్రతిపక్షం ఉండటం మా లక్ అన్నారు.. ఏమో అనుకున్నాం అమిత్ షా బాగానే కౌంటర్ వేశారు.