జాత్యహంకార దాడులు.. వైట్‌హౌస్‌ ఎదుట నిరసన

 

అమెరికాలో జాత్యహంకార దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన దగ్గరనుండి ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు దీనిలో భాగంగానే  అధ్యక్ష నివాసమైన వైట్‌హౌస్‌ ఎదుట పలువురు ఇండో అమెరికన్లు ఆందోళన చేపట్టారు. భారత సంతతికి చెందినవారు ముఖ్యంగా హిందువులు, సిక్కులు అమెరికాలో విద్వేషపూరిత దాడులకు బలవుతున్న నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైట్‌హౌస్‌ ఎదుట అవగాహన ర్యాలీ చేశారు. అమెరికాలో విద్వేషానికి హిందువులు ఎక్కువగా బాధితులవుతున్నారని వర్జీనియాకు చెందిన న్యాయవాది వింద్య అడపా అన్నారు. విద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అధ్యక్షుడు ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండించాలని కోరుతున్నట్లు చెప్పారు. మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.