అమర్ సింగ్ అనూహ్య నిర్ణయం...అందుకేనా...!

 

సమాజ్ వాదీ పార్టీలో గత కొద్ది కాలంగా కుటుంబ విభేదాలు నెలకొన్నసంగతి తెలిసిందే. అయితే ఈ విభేదాలకు కారణం అమర్ సింగ్ అన్న ఆరోపణలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమర్ సింగ్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే యూపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే చికిత్స కోసం త్వరలో లండన్‌కు వెళ్తున్నట్టు అమర్‌ సింగ్‌ చెప్పారు. ‘నేను గతంలో లండన్‌లో చికిత్స చేయించుకున్నాను. పార్టీ నుంచి పిలుపు రావడంతో మధ్యలో వచ్చేశాను. చికిత్స పూర్తిగా చేయించుకోవడానికి ఇప్పుడు మళ్లీ లండన్‌ వెళ్తున్నాను. తర్వాత సింగపూర్కు వెళ్తాను. మార్చి చివర్లో తిరిగి వస్తాను’ అని అమర్‌ సింగ్‌ చెప్పారు. దీంతో ఇప్పుడు ఇది పెద్ద చర్చాంశనీయంగా మారింది. అఖిలేష్‌ డిమాండ్‌ మేరకు ములాయం తన సన్నిహితుడు అమర్‌ సింగ్‌ను కొన్నాళ్లు పక్కనపెట్టారా? లేక తానే దూరంగా ఉండాలని అమర్‌ భావిస్తున్నారా? ఈ రెండు కారణాలు గాక ఆయన చికిత్స కోసమే లండన్‌ వెళ్తున్నారా అన్నది ఎస్పీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా యూపీలో ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.