మిలిటరీ విమానం కూలి 105 మంది మృతి...

 

మిలిటరీ విమానం కుప్పకూలిపోయి 105 మంది మృతి చెందారు. ఈ ఘటన అల్జీరియా రాజధాని అల్జీర్స్ కు సమీపంలో ఉన్న బౌఫారిక్ ఎయిర్ పోర్టు వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... బౌఫారిక్ ఎయిర్ పోర్టు వద్ద  టేకాఫ్ తీసుకున్న విమానం వెంటనే క్రాష్ అయిపోయింది. ఇక ఈ విమానంలో 200 మంది మిలిటరీ సిబ్బంది ఉండగా అందులో 105 మంది మృతి చెందినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. 14 అంబులెన్స్ లు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించాయి. సహాయక చర్యలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు... ఎయిర్ పోర్ట్ చుట్టపక్కల ఉన్న అన్ని రోడ్లను మూసేశారు.