విభజనతో నిజాంకేం సంబంధం: ఓవైసీ

 

 

 

అసెంబ్లీ లో తెలంగాణ బిల్లుపై చర్చ సంధర్బంగా కొంతమంది నేతలు నిజాం పేరును ప్రస్తావించడంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు కారణమైన వారిని వదిలేసి నిజాం పేరును ప్రస్తావించడం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రస్తుత రాష్ట్ర విభజనకు నిజాంకు సంబంధం లేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. చైనాతో పోరాడేందుకు 120 కేజీల బంగారాన్ని నిజాం ఇచ్చారని, మానినగాయాలు మళ్లీ గుర్తు చేయవద్దని అక్బరుద్దీన్ అన్నారు. హైదరాబాదును జవహర్ లాల్ నెహ్రూ మినీ ఇండియా అన్నారని గుర్తు చేశారు. నిజాం గుడ్ లీడర్, గుడ్ రూలర్ అన్నారు.

 

తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా దీనిపై స్పందించారు. వరంగల్ లో బతుకమ్మ ఆడుతున్న తెలంగాణ పడుచులను బట్టలిప్పించి బతుకమ్మ ఆడించి నిజాంను పొగడటం అంటే తెలంగాణ ప్రజలను మోసగించడం, అవమానించడమే అన్నారు. నిజాం అనే వాడు కట్టిన విద్యుత్ ప్లాంటు ఆయన ప్యాలెస్ వెలుగుల కోసం, ఆయన కట్టిన నీటి ప్రాజెక్టు ఆయనకు నచ్చిన వ్యవసాయ క్షేత్రాల కోసం, ఆయన కట్టిన ఆర్ట్స్ కాలేజీ తెలంగాణలో ఉన్న భూస్వాముల కోసం, తనకు నచ్చిన వారికోసమని అన్నారు.