ఎయిర్ టెల్ పై జియో ఆగ్రహం..

 

ఎయిర్ టెల్ పై జియో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఫ్రీ సర్వీసులు ఆఫర్ చేస్తున్న జియోకు ధీటుగా ఎయిర్ టెల్ కూడా ఫ్రీఆఫర్లు ఇస్తుంది. తమ కస్టమర్లకు ఎయిర్ టెల్ కనెక్టింగ్ పోర్టులను ఇవ్వడం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరోసారి ఆరోపించింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో 7.24 కోట్ల మంది జియో సేవలను అందుకునేందుకు కస్టమర్లుగా మారారని, తమకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక పెద్ద టెలికం సంస్థలు కనెక్టింగ్ పోర్టులను ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించింది. రిలయన్స్ జియో కస్టమర్ల కోసం ఇతర టెలికం సంస్థలు కేటాయించిన పీఓఎల్ (పాయింట్స్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్)ల సంఖ్య చాలా తక్కువని... జియో నుంచి వెళ్లే ప్రతి 1000 కాల్స్ లో కేవలం 175 కాల్స్ మాత్రమే కనెక్ట్ అవుతున్నాయని పేర్కొంది.