జోరుగాలివానతో కేరళ విమాన ప్రమాదం

చాకచక్యంగా వ్యవహరించి వందలాది మంది ప్రాణాలు కాపాడిన పైలట్లు

 

జరుగుతున్న విచారణ

 

శుక్రవారం 7ఆగస్టు 2020 ..  అరబ్ దేశాల్లోని దుబాయ్ నుంచి ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 1344 (బోయింగ్ 737 విమానం) కోజివీడ్ కాలికట్ కు బయలుదేరింది. ఈ విమానాన్ని వైమానిక దళ మాజీ పైలెట్ దీపక్ వసంత్ సాథే నడుపుతున్నారు. కో పైలట్ గా అఖిలేష్ కుమార్ ఉన్నారు. విమానంలో పది మంది చిన్నారులు, ఏడుగురు సిబ్బందితో కలిపి మొద్దం 191 మంది ప్రమాణికులు ఉన్నారని సమాచారం. ఈ విమానం 13సంవత్సరాల కిందటి  విటి -ఎెక్స్ హెచ్  బోయింగ్ 737 - 8హెచ్ జి విమానం.

 

భారత కాలమానం ప్రకారం సరిగ్గా రాత్రి ఏడు గంటల 39 నిమిషాలు. ఎయిరిండియా 1344 విమానాన్ని కోజివీడ్ విమానాశ్రయంలోని రన్ వే 28పై ల్యాండింగ్ కావడానికి పైలట్స్  ప్రయత్నం చేశారు. అయితే జోరుగాలి, భారీ వర్షం కారణంగా వారు చేసిన మొదటి ప్రయత్నం విఫలం అయ్యింది.  ఎయిర్ పోర్టు ప్రాంతంలో పలుమార్లు చక్కర్లు కొట్టిన తర్వాత మరోసారి ల్యాండింగ్ కావడానికి ప్రయత్నం చేశారు. రెండోసారి రన్ వే 10పై ల్యాండ్ కావడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో గాలి 12నాట్స్ స్పీడ్ తో వీస్తోంది. విమానాన్ని వెనక్కి నుంచి జోరుగాలి ముందుకు తోయడంతో స్పీడ్ ను అదుపు చేయడానికి ప్రయత్నించారు. స్పాయిలర్స్, త్రస్ట్ రివర్స్, బ్రేక్స్  వేశారు. అయినా స్పీడ్ అదుపులోకి రాకపోవడంతో విమానం రన్ వే దాటి ముందుకు దూసుకు పోయ్యింది. భారీ వర్షం, జోరుగాలి, చీకటి కారణంగా విజుబులిటీ 2000మీటర్ల మేరకే ఉంది. పరిస్థితి పైలట్ల చేయి దాటి పోయింది. దాంతో రన్ వే దాటి ముందుకు వెళ్ళిన విమానం రన్ వే పక్కనే ఉన్న 50 అడుగుల లోతులో పడిపోయింది. భారీశబ్ధంలో విమానం విరిగిపోయింది. పైలట్ , కో పైలట్ తో సహా 17మంది అక్కడికక్కడే మరణించారు. 50మందికి పైగా గాయపడ్డారు. ఇందులో చాలా మంది పరిస్థితి సీరియస్ గా ఉంది.

 

వాతావరణం సరిగ్గా లేని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విమాన ప్రమాదంలో  వైమానిక దళంలో పైలట్ గా విధులు నిర్వహించి ఎన్నో అవార్డులు అందుకున్న పైలట్ దీపక్ అప్రమత్తంగా వ్యవహరించడంతోనే భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు అంటున్నారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి సకాలంలో ఇంజిన్లను ఆఫ్‌ చేయడం వల్ల విమానంలో మంటలు చెలరేగకుండా నివారించారు. దీంతో పెను ముప్పి తప్పి, వంద మంది ప్రాణాలు కాపాడారు. విమాన ప్రమాదంలో కీలకంగా భావించే ‘బ్లాక్‌ బాక్స్‌’ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ జరుగుతోంది. 

 

ఇదే విధంగా 5ఫిబ్రవరి 2020న ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో భారీవర్షం కారణంగా737 - 800 బోయింగ్ విమానం, పెగసాస్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 2193 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలోనూ విమానం విరిగిపోయింది. ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. ఈ రెండు ప్రమాదాల్లోనూ బోయింగ్ 737 విమానమే ప్రదామానికి గురుకావడం యాదృచ్ఛికం. ఈ ప్రమాదాలపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది.