రాహుల్ వచ్చిన వేళ... నిన్న 2జీ స్కాం.. ఈరోజు ఆదర్శ్ స్కామ్

 

2జీ స్కాం. యూపీఏ హయాంలో జరిగిన అతిపెద్ద స్కాం ఇదేనని చెప్పుకుంటారు. అంతేకాదు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ దీనిని అడ్డపెట్టుకొని ప్రచారం చేసుకుంది. అధికారం చేపట్టింది. దేశంలోనే అతిపెద్ద స్కా అయిన దీనిపై నిన్న సంచనల తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇంత పెద్ద స్కాంలో కేవలం ఆధారాలు లేవన్న సింపులు రీజన్ తో దోషులుగా ఉన్న వారిని... నిర్దోషులుగా తేల్చేసింది. దీంతో అందరి సంగతేమో కానీ... కాంగ్రెస్ మాత్రం ఈ తీర్పుపై చాలా హ్యాపీగా ఉంది. తమకు అవినీతి అంటేనే అసలు తెలియదు అన్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా చర్చించుకుంటున్నారు.

 

అదేంటంటే... గుజరాత్ ఎన్నికల పుణ్యమా అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హీరో అయ్యాడు. కాంగ్రెస్ ఓడిపోయినా.. రాహుల్ కు సక్సెస్ అయ్యాడు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాడని.. మోడీకి చెమటలు పట్టించాడని అనుకున్నారు. ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వేళా విశేషం.. అతి పెద్ద 2జీ స్కాం నుండి బయటపడ్డామని అంటున్నారు. ఇక ఇవాళ, మహారాష్ట్రలో జరిగిన ఆదర్శ్ స్కామ్ లో మాజీ సీఎం అశోక్ చవాన్ ను విచారించరాదని చెబుతూ బాంబే హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో అప్పుడు సీఎంగా ఉన్న చవాన్ ను ప్రాసిక్యూట్ చేయాలని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశించగా, వాటిని హైకోర్టు తోసిపుచ్చింది. దర్యాప్తులో సీబీఐ సాక్ష‍్యాలు సమర్పించకపోవటంతో ఆయన్ని తిరిగి విచారించేందుకు అనుమతి ఇస్తూ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ చవన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 2జీ స్పెక్ట్రమ్ కేసు నుంచి విముక్తి చెందిన మరుసటి రోజునే ఆదర్శ్ కుంభకోణం నుంచి చవాన్ ఊరట పొందడం గమనార్హం. దీంతో రాహుల్ వచ్చిన వేళా విశేషం.. కాంగ్రెస్ పై ఉన్న మరకలు ఒక్కొక్కటిగా పోతున్నాయి అని అనుకుంటున్నారు.