ధనుష్ కు భారీ ఊరట..కదిరేశన్ దంపతుల పిటిషన్ కొట్టివేత


రజనీకాంత్ అల్లుడు ధనుష్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ధనుష్ మా కుమారుడే అంటూ కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ తమ బిడ్డేనని, తప్పిపోయాడని, ఇప్పుడు అతన్నుంచి తమ పోషణ నిమిత్తం నెలకు కొంత డబ్బు ఇప్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో పుట్టుమచ్చలు చూపించాలని హీరో ధనుష్‌కు కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ కేసు విచారణ దశలో, ధనుష్ తన శరీరంపై ఉన్న పుట్టు మచ్చలను చెరిపేశారని డాక్టర్లు నివేదిక ఇవ్వడంతో కలకలం రేగింది. అయితే ఇప్పుడు తాజాగా మద్రాస్ హైకోర్టు కదిరేశన్ దంపతుల పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు నిచ్చింది.