కోహ్లీకి బిగ్ షాక్.. 'ఆర్‌సీబీ' కెప్టెన్ గా డివిలియర్స్‌.!

విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లో ఒకడు.. టీమిండియా కెప్టెన్ గా అదరగొట్టేస్తున్నాడు.. అయితే కోహ్లీకి ఒకటి మాత్రం అందని ద్రాక్షలా మిగిలిపోయింది.. అదే ఐపీఎల్ ట్రోఫీ.. కోహ్లీ 2013 నుంచి ఆర్‌సీబీకి కెప్టెన్‌గా ఉన్నాడు.. ఐపీఎల్ లో ఆర్‌సీబీకి మంచి క్రేజ్ ఉంది.. స్టార్ ప్లేయర్స్ తో కళకళలాడే ఆర్‌సీబీ టీం మీద ఎప్పుడూ విపరీతమైన అంచనాలు ఉంటాయి.. కానీ ఆ అంచనాలను ఆర్‌సీబీ ఒక్కసారి నిజం కాలేదు.. ఇప్పటి వరకు ఒక్క సీజన్లో కూడా టైటిల్ విజేతగా నిలవలేదు.

 

 

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం ఆర్‌సీబీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.. ఇందులో భాగంగా ఇప్పటికే కోచ్‌ను మార్చింది.. డానియల్‌ వెటోరీ స్థానంలో గ్యారీ కిర్‌స్టన్‌కు బాధ్యతలు అప్పగించారు.. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది.. అదేంటంటే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు విరాట్‌ కోహ్లీ స్థానంలో ఏబీ డివిలియర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడట.. టీమిండియాను విజయపథంలో నడిపే కోహ్లీ ఆర్‌సీబీకి మాత్రం విజయాలు అందించలేకపోతున్నాడు.. దీంతో ఆ జట్టు యాజమాన్యం డివిలియర్స్‌కు జట్టు పగ్గాలు అందించాలని యోచిస్తున్నట్లు సమాచారం.. మరి యాజమాన్యం నిజంగానే కోహ్లీని మార్చే ధైర్యం చేస్తుందో లేదో చూడాలి.