Top Stories

 అఘోరీ చెర నుంచి బయటపడ్డ మంగళగిరి అమ్మాయి శ్రీవర్షిణి

వివాదాస్పద లేడీ అఘోరీ  చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల ఇంట్లో బస చేసిన  అఘోరీ మాయమాటలు చెప్పి  శ్రీ వర్షిణిని లోబరుచు కుంది. గత నెల రోజులుగా శ్రీవర్షిణి అఘోరీతో కలిసి ఉంటుంది. తమ కూతురుకి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్దు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. తొలుత శ్రీవర్షిణి మేజర్ అని బుకాయించిన అఘోరీ  శుక్రవారం గుజరాత్ పోలీసులకు చుక్కలు చూపే ప్రయత్నం చేసింది. గుజరాత్ పోలీసులు తమ స్టైల్ లో మర్యాదలు చేయడంతో అఘోరీ లొంగిపోయింది. శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు గుజరాత్ కు వెళ్లి ఆమెను విడిపించారు. 
 అఘోరీ చెర నుంచి బయటపడ్డ మంగళగిరి అమ్మాయి శ్రీవర్షిణి Publish Date: Apr 4, 2025 4:33PM

నాగబాబు పర్యటనలో పిఠాపురం వర్మ అనుకూల నినాదాలు

ఎమ్మెల్సీగా  నాగబాబు తన తొలి అధికారిక పర్యటన పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు. జనసేన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మొట్టమొదటి సారిగా అధికారికంగా పిఠాపురం నియోజకకవర్గంలో శుక్రవారం (ఏప్రిల్ 4) పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని గోల్లప్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ సందర్భంగా నియోజకవర్గంలో తెలుగుదశం, జనసేన ల మధ్య ఉన్న విభేదాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. నాగబాబు సమక్షంలో ఇరు పార్టీల కార్యకర్తలు పోటీపోటీగా నినాదాలు చేశారు. జనసేన శ్రేణులు జై జనసేన అంటూ నినాదాలు చేయగా తెలుగుదేశం వర్గీయుల నుంచి పెద్ద పెట్టున జై వర్మ అంటూ పిఠాపురం వర్మకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇటీవల జనసేన ఆవిర్భాత సభలో నాగబాబు వర్మకు సంబంధించి ఒకింత వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం శ్రేణులకు ఆగ్రహం కలిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నాగబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పిఠాపురం వర్మ ఫొటో లేకపోవడంతో తెలుగుదేశం శ్రేణులు పిఠాపురం వర్మకు అనుకూలంగా  నాగబాబు సమక్షంలో నినాదాలు చేశారు. పైగా నాగబాబు నియోజకవర్గ పరిధిలో చేసిన ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద పిఠాపురంలో నాగబాబు తొలి సారిగా జరిపిన పర్యటన నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలను బయటపెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
నాగబాబు పర్యటనలో పిఠాపురం వర్మ అనుకూల నినాదాలు Publish Date: Apr 4, 2025 4:07PM

   తెలంగాణ బిజెపిలో అంతర్యుద్దం... కిషన్ రెడ్డి పై రాజాసింగ్ ఫైర్ 

తెలంగాణ బిజెపిలో విభేధాలు ముదిరిపోతున్నాయి. హైద్రాబాద్ కు చెందిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్  కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి సందర్బంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు పోటీగా  బిజెపికి చెందిన గౌతంరావు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న రాజాసింగ్ పార్టీ  రాష్ట్ర అధిష్టానంపై విమర్శలు చేశారు.  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేశారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ కు గురయ్యారు.  గౌతంరావుకు  స్థానిక సంస్థల ఎంఎల్ సి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా  టికెట్  ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో రాజాసింగ్ పార్టీ  రాష్ట్ర అధిష్టానంపై ఎక్కుపెట్టారు.  మేకప్ మెన్ లు, టేబుల్ తుడిచే వాళ్లకు టికెట్లు ఇస్తున్నట్లు  ఆరోపించారు. గత పార్ల మెంటు ఎన్నికల్లో హైద్రాబాద్ బిజెపి అభ్యర్థిగా మాధవిలత ప్రకటించగానే  రాజాసింగ్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి మగాళ్లే దొరకలేదా అని కామెంట్ చేశారు.   తాజాగా హైద్రాబాద్ స్థానిక సంస్థల బిజెపి అభ్యర్థిగా గౌతంరావు పేరు ప్రకటించారు. అంబర్ పేట నియోజకవర్గంలో గౌతంరావు, కిషన్ రెడ్డి ప్లెక్సీలు ఉండటంతో రాజాసింగ్ కు మింగుడు పడలేదు. శ్రీరామనవమి శోభాయాత్రకు పోటీగా గౌతంరావు మరో శోభాయాత్ర నిర్వహించడం వివాదానికి దారి తీసింది.  నేను నిర్వహిస్తున్న శోభాయాత్రను అడ్డుకోవడం మీ అయ్యతరం కూడా కాదని వ్యాఖ్యానించారు. 
   తెలంగాణ బిజెపిలో అంతర్యుద్దం... కిషన్ రెడ్డి పై రాజాసింగ్ ఫైర్  Publish Date: Apr 4, 2025 3:11PM

వక్ఫ్ బిల్లుకు ఆమోదం.. దేశ రాజకీయాల్లో మలుపు ?

అనుకున్నదే జరిగింది. వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను, 24 గంటల తేడాతో  పార్లమెంట్ ఉభయ   సభలు ఆమోదించాయి. అర్థరాత్రి ఆమోదం పొందిన బిల్లుల జాబితాలో, వక్ఫ్‌ సవరణ బిల్లు-2024- (యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియన్సీ అండ్‌ డెవల్‌పమెంట్‌- యూఎంఈఈడీ-ఉమీద్‌) బిల్లు కూడా చేరింది. అవును. సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం (ఏప్రిల్ 2) అర్ధరాత్రి దాటాక లోక్‌సభ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు, గురువారం (ఏప్రిల్3) అర్థరాత్రి దాటిన తర్వాత రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం మాత్రమే మిగిలుంది. ఆ ఒక్క గడప దాటేస్తే.. బిల్లు చట్టమవుతుంది. ఆ తర్వాత  ఏమవుతుంది? ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. దేశ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయి అనేది ఇప్పడు దేశం ముందున్న పెద్ద ప్రశ్నగా రాజకీయ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఇక విషయంలోకి వస్తే.. పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక బిల్లు పై ఇంత సుదీర్ఘ చర్చ జరగడం ఇటీవలి కాలంలో ఇదే ప్రప్రథమం కావచ్చు. బిల్లుకు అనుకూలంగా అధికార ఎన్డీఎ కూటమి, వ్యతిరేకంగా విపక్ష, ఇండియా కూటమి గట్టిగా నిలబడ్డాయి. పటిష్ట వాదనలు వినిపించాయి. ఉభయ సభల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్యనాయకులు అందరూ, చర్చలో పాల్గొన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు బలంగా వినిపించారు. అయితే ఇంత సుదీర్ఘంగా జరిగిన చర్చలో లోక్ సభలో సభా నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెదవి విప్పలేదు. ప్రధానమంత్రి  మోదీ అయితే అసలు సభలోనే అడుగు పెట్ట లేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  చర్చ ప్రారంభంలో కొంత సేపు సభలో ఉన్నారు. మధ్యలో వెళ్ళిపోయి  మళ్ళీ ఓటింగ్ సమయానికి వచ్చారు. అంతే కాదు  సభలో ఉన్న సమయంలోనూ రాహుల్ గాంధీ ముభావంగానే ఉన్నారు. ఎదుకనో ఏమో కానీ  ప్రధాన చర్చలో పాల్గొనలేదు. లోక్ సభలో   గొగొయ్ ప్రధాన ప్రసంగం చేశారు. చివరకు, అర్థరాత్రి దాటిన తర్వాత ఓటింగ్ సమయానికి వచ్చిన సమయంలోనూ అయన నైట్ డ్రెస్  లో మొక్కుబడిగా సభకు వచ్చారనీ. ఇది ఆయన నిరాసక్తతకు మరో నిదర్శనంగా కొందరు పేర్కొన్నారు. అలాగే  ఇటు చర్చ జరుగుతుంటే.. ఆయన అటు తిరిగి ఫోన్  చూసుకోవడం గురించి కూడా కొందరు ప్రస్తావించారు. చివరకు మీడియా బ్రీఫ్ లోనూ రాహుల్ గాంధీ కనిపించక పోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నాయి.  అయితే  ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరాసక్తంగా ఉన్నా.. విపక్ష ఇండియా కూటమి ఐక్యంగా వుంది. ఏక తాటిపై నడిచింది. ఉభయ  సభల్లోనూ ఒక్క ఓటు బీర పోకుండా కాపాడుకుంది. ఆవిధంగా, బిల్లు పాస్  అయినా.. ఒక విధంగా విపక్ష ఇండియా కూటమి,  విజయం  సాధించింది. కూటమి మనుగడ పట్ల వ్యక్తమవుతున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, కూటమి ఎంపీలు, ముక్త కంఠంతో హమ్ ఏక్’ హై అని  నినదించారు.  నిరూపించారు.  నిజం, నిజంగా, ఇదొక అనూహ్య పరిణామం. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బయట పడిన విభేదాల నేపధ్యంలో ఇండియా కూటమి ఉన్నట్లా లేనట్లా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న సమయంలో ఇండియా కూటమి ఏక తాటిపైకి రావడం సామాన్య విషయం కాదు. నిజానికి ఇటీవల కాలంలో ఇండియా కూటమిలో విభేదాలు తార స్థాయికి చేరిన విషయం కాదన లేనిది. చివరకు కొందరు కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా  లోక్ సభ ఎన్నికలతోనే ఇండియా కూటమి  కథ ముగిసిందనే అభిప్రాయం వ్యక్త పరిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ- కశ్మీర్ ముఖ్యమంత్రి, ఒమర్ అబ్దుల్లా ,సిపిఎం నేత ప్రకాష్ కరత్, ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఇండియా కూటమి  మనుగడ పై అనుమనాలు వ్యక్త పరిచారు.  తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా, కొందరు ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకత్వం నుంచి తప్పుకోవాలని డిమాండ్ లాంటి సూచన చేశారు. అంతే కాదు  కొందరు  కూటమి నాయకులు,మీడియా విశ్లేషకులు, ఇండియా కూటమికి  శ్రద్ధాంజలి  ఘటించారు. అలా మనుగడ కోల్పోయిందని కొందరు,  అసలు  పోనే పోయిందని,ఇంకొందరు అనుకున్న ఇండియా కూటమికి వక్ఫ్ సవరణ బిల్లు సంజీవనిలా ప్రాణం పోసిందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే  ఈ ఐక్యత ఇలాగే, నిలుస్తుందా? నిలబడుతుందా? పార్లమెంట్  లోపలి సఖ్యత  వెలుపలా కొనసాగుతుందా? ముఖ్యంగా ఎన్నికల రణ క్షేత్రంలో ఎన్డీఎని ఎదురొడ్డి ఐక్యంగా నిలబడుతుందా? అంటే, మాత్రం అనుమానమే అంటున్నారు. అయినా, ప్రస్తుతానికి  అది అనవసర చర్చగానూ పరిశీలకులు భావిస్తున్నారు. అదొకటి అయితే.. బిల్లుపై చర్చ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయలు, వినవచ్చిన వాస్తవాలు ఆశ్చర్యం గొలిపే విధంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  నమ్మసక్యం కాకుండా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా, పార్లమెంట్ భవనంతో సహా, ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (సీజీవో)  సైతం ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసిందని, స్వయంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రికార్డుల అదారంగా చెప్పిన విషయం,ఆశ్చర్య పరిచే విధంగా ఉందని అంటున్నారు. అంతే కాదు.. వక్ఫ్ పేరిట జరుగతున్న దురాక్రమణలు, దుర్వినియోగం గురించి సభ్యులు చేసిన ఆరోపణ లలోని నిజానిజాలు బయట పడాలంటే,అందుకుమరి కొంత సమయం పడుతుందిని అంటు న్నారు.అందుకే, చట్ట రూపం దాలుస్తున్న  వక్ఫ్ సవరణ బిల్లు దేశ రాజకీయాలలో  ఒక మలు పుకు దారి తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.
వక్ఫ్ బిల్లుకు ఆమోదం.. దేశ రాజకీయాల్లో మలుపు ? Publish Date: Apr 4, 2025 3:00PM

తెలంగాణ రాజకీయాలు.. ఓవర్ టూ ఢిల్లీ !

తెలంగాణ రాజకీయాలు ఇప్పడు ఢిల్లీ చేరుకున్నాయా?  జంతర్ - మంతర్ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ రాజకీయాలకు వేదికగా మారుతున్నాయా? అంటే  మంగళవారం (ఏప్రిల్ 1)  దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చోటు చేసుకున్న విభిన్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అవును రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్న బీసీ రిజర్వేషన్, హెచ్‌సీయూ భూమల విక్రయం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, మంత్రివర్గ విస్తరణకి సంబందించిన అనేక కీలక అంశాలు బుధవారం ( ఏప్రిల్ 2)  ఢిల్లీలో సందడి చేశాయి.  ఓ వంక లోక్ సభలో అత్యంత కీలకమైన, అంతకు మించి అత్యంత వివాదస్పదమైన వక్ఫ్ సవరణ బిల్లు పై వాడివేడి చర్చ జరుగతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జంతర్ మంతర్ నుంచి ‘మోదీ దిగిరావాలని’ డిమాండ్ చేశారు. లేదంటే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం, దేశాన్ని జాగృతం చేస్తాం, బీజేపీని బూడిద చేస్తాం అంటూ గర్జించారు. హెచ్చరించారు. అయితే  రేవంత్ రెడ్డి గర్జించింది వక్ఫ్ సవరణ బిల్లు విషయంగా కాదు.  విద్య, ఉద్యోగాలతోపాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ బుధవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన  బీసీ పోరుగర్జన సభలో రేవంత్‌ రెడ్డి ఈ గర్జన చేశారు. రేవంత్ రెడ్డి గర్జనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు  లక్ష్మణ్  అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు.  మీ మంత్రి వర్గంలో 46 శాతం బీసీలు ఉన్నారా?  అంటూ  కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంతే  కాదు  బీసీలకు 42 రిజర్వేషన్ కల్పిస్తామని బిల్లు చేసి మరీ అసెంబ్లీకి ఇచ్చిన హామీ నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారని కిషన్ రెడ్డి  కౌంటర్ ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి గర్జన, కిషన్ రెడ్డి కౌంటర్ స్పందన.. ఇతర పరస్పర ఆరోపణల పర్యవసానాలు, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్  వద్ద గర్జన చేస్తున్న సమయంలోనే లేదంటే కొంచెం అటూ ఇటుగా రాజ్యసభలో  హెచ్‌సీయూ భూమల అమ్మకం వ్యవహారం రాజ్యసభలో ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ పక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి  రాష్ట్రంలో  రోజు రోజుకు రాజకీయ వేడిని పెంచుతున్న హెచ్‌సీయూ భూమల విక్రయం  అంశాన్ని సభలో ప్రస్తావించారు. రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన సురేష్ రెడ్డి, అరుదైన పశుపక్షాదులకు ఆవాసంగా ఉన్న కంచ గచ్చిబౌలి  లోని 400 ఎకరాల భూమి విక్రయానికి వ్యతిరేకంగా విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం  అమానుషంగా, అత్యంత క్రూరంగా అణచి వేస్తోందని ఆరోపించారు. అలాగే  బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూముల విక్రయ నిర్ణయం వలన విద్యార్ధుల భవిష్యత్ దెబ్బతినడమే కాకుండా, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది.  మరో వంక  ఇదే అంశంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద బీజేపీ ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో పాటుగా గోడం నగేష్‌, రఘునందన్‌రావు, డీకే అరుణ, కొండా,బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ హెచ్‌సీయూ భూములను అమ్మితే సహించేంది లేదని, తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెచ్‌సీయూ భూమల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఎంపీలు కేంద్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి, యూనివర్సిటీ భూములు విక్రయిస్తే పర్యావరణ పరంగా ఎదురయ్యే అనర్ధాలను వివరించారు. అటవీ, వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. బీజేపే ఎంపీల విజ్ఞప్తి మేరకు  కేంద్ర అటవీ సంరక్షణ శాఖ, వివాదాస్పద కంచ గచ్చిబౌలి భులకు సమబందించిన సమగ్ర నివేదికని తక్షణం పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా రాష్ట్ర రాజకీయాలు బుధవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలో వేడిని పుట్టించాయి.  నిజానికి ఇవన్నీ ఒకెత్తు అయితే.. తెలంగాణ రాజకీయం ఢిల్లీలో వీరంగం వేస్తున్న సమయంలోనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెత్తిన దేశ సర్వోన్నత న్యాయస్థానం అక్షింతలు వేసింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్టు, మళ్ళీ మరోమారు అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా హెచ్చరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ నాలుగేళ్లు చర్యలు తీసుకోకున్నా సుప్రీం కోర్టు చేతులు కట్టుకుని కుర్చోవాలా  అని ఘాటుగా వ్యాఖ్యానించింది.  గత ప్రభుత్వ హయాంలో పార్టీ ఫిరాయించిన వారి విషయంలో ఏమి జరిగిందో, ఇప్పుడూ అదే జరుగుతుంది, అనర్హత వేటు పడదు, ఉప ఎన్నికలు రావు అంటూ  ముఖ్యమంత్రి రెంత్ రెడ్డి, రాష్ట శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో, చేసిన వ్యాఖ్యలను సుప్రీం  కోర్టు తప్పు పట్టింది. నిండు సభలో ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేసింది నిజమే అయితే..  రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును అపహాస్యం చేయడం కిందికే వస్తుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఆర్‌ఎస్‌ నుంచి అధికార అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా  బీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ ఆర్యామ సుందరం.. మార్చి 26న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫిరాయింపుల  వ్యవహారం కూడా ఢిల్లీ ఖాతాలో  చేరింది.  ఇలా ఒక దానివెంట ఒకటి,  రాష్ట్ర రాజకీయాలు,  యాధృచ్ఛికమే అయినా ప్రస్తుతానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే  ఢిల్లీ సీన్ ఢిల్లీలో సాగుతుంటే రాష్ట్రంలోనూ రాజకీయ ఉష్ణోగ్రతలు ఎండలతో పోటీ పడి పరుగులు తీస్తున్నాయి. 
తెలంగాణ రాజకీయాలు.. ఓవర్ టూ ఢిల్లీ ! Publish Date: Apr 4, 2025 2:35PM

బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ తో ప్రధాని మోడీ భేటీ

 బంగ్లాదేశ్ చైనా, పాక్ లకు మద్దత్తు నిస్తున్న నేపథ్యంలో  భారత ప్రధాని మోడీ   బ్యాంకాక్ లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. యూనస్ బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన  ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది.  బ్యాంకాక్ లో బిమ్ స్టెక్ సుమ్మిట్ సందర్బంగా మోదీకి ఆహ్వానం అందింది. ఇదే సుమ్మిట్ కు బంగ్లా ప్రధాని యూనస్ హాజరయ్యారు. చైనా, పాకిస్తాన్ లకు అనుకూలంగా యూనస్ వ్యాఖ్యానాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్రతీర ప్రాంతం లేదని, తమ దేశంలో బంగాళాఖాతం తీర ప్రాంతం ఉండటంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చుకోవచ్చని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గ్యాప్ ఏర్పడింది. యూనస్ ప్రకటనపై అస్సాం సిఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలు చికెన్ నెక్ కారిడార్ ద్వారా కనెక్ట్ అయ్యాయన్నారు. యూనస్ ప్రకటనను అంత తేలికగా తీసుకోకూడదన్నారు. 
బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ తో ప్రధాని మోడీ భేటీ Publish Date: Apr 4, 2025 2:19PM