Top Stories

బీహార్ బాబు నితీష్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఈ సంవత్సరం  అక్టోబర్-నవంబర్‌ నెలల్లో ఎన్నికలు జరిగవలసి వుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. మరోవంక రాజకీయ పార్టీలూ ఎన్నికల పోరుకు సిద్దమవుతున్నాయి.  ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా కూటమి ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. ప్రధానంగా పొత్తులు, ఎత్తుల  గురించిన చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పొత్తుల పరంగా చూస్తే, అటు ఎన్డీఏలో ఇటు ఇండియా కూటమిలోనూ ఇప్పటివరకు అయితే 2020 పొత్తులలో మార్పు లేదు.    అలాగే, ఇరు కూటముల నాయకులు, ముఖ్యంగా, మధ్యలో ఇటు నుంచి అటు నుంచి ఇటు దూకిన, జేడీయు అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ఆ ‘తప్పు’ చేయనని స్పష్టం చేశారు. గత నెల (మార్చి) చివర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన సమయంలో నితీష్ కుమార్  షా సమక్షంలో  గతంలో రెండు సార్లు చేసిన తప్పు మరో సారి చేయనని, ఎన్డీఏను  వీడనని, స్పష్టం చేశారు.  అలాగే  ఎన్డీఎ కూటమిమలోని ఇతర పార్టీల నేతలు  ఎల్జీపీ ( పాశ్వాన్) అధ్యక్షుడు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ అవామ్ మోర్చా (లౌకిక) అధ్యక్షడు జితన్ రామ్ మాంఝీ కూడా ఎన్డీఎతో కొనసాగుతామని ప్రకటించారు. అంతే కాకుండా ఇటీవల బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్  ఎన్డీఏ నేతలతో ఢిల్లీలో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్  మీడియాతో మాట్లాడుతూ బీహార్ అసెంబ్లీ  ఎన్నికల్లో ఎన్డీఏ విజయం  పట్ల  విశ్వాసం ప్రకటించారు. అంతకుముందు పశ్చిమ చంపారన్ జిల్లాలో జరిగిన ఎన్డీఏ కార్యకర్తల సంయుక్త సమావేశంలో మొత్తం 243 సీట్లలో 225 ఎన్డీఏ గెలుచుకుంటుందని నాయకులు ప్రకటించారు.ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల  రాష్ట్ర అధ్యక్షులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.  మరో వంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఈ నెల 24 న  మూడు నెలల్లో రెండవ సారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు, మధుబనిలో జరిగే పంచాయతీ రాజ్ కార్యక్రమంలో పాల్గొని దేశంలోని పంచాయతీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే  పాట్నా విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. అంతకు ముందు  ఫిబ్రవరి 24న, ప్రధాని మోదీ భాగల్పూర్‌ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం  19వ విడత నిధులను విడుదల చేశారు. ఆ సందర్భంగా రైతులతో సంభాషించడంతో పాటు విమానాశ్రయ మైదానంలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. మరో వంక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేసే ఆలోచన లేదని  ఇండియా కూటమి  భాగస్వామ్య పార్టీలన్నీ ఒకటిగానే పోటీ చేస్తాయని కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన నేపధ్యంలో  బీహార్ లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రచారం జరుగతున్న నేపధ్యంలో కాంగ్రెస్  నేతలు అలాంటి ఆలోచన లేదని స్పష్టత ఇచ్చారు. అయితే  ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సమిష్టి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ  ఆర్జేడీ మాత్రం  మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్  కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది.  మరో వంక  రాజకీయ నాయకుని అవతారం ఎత్తిన ఎన్నికల వ్యూహ కర్త  ప్రశాంత్ కిశోర్ ఇండియా కూటమితో జట్టు కట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోది. ఆయన స్థాపించిన  జన సూరజ్ పార్టీ ఇండియా కూటమిలో చేరుతుందని ఎఐసీసీ కార్యదర్శి, బీహార్ రాష్ట్ర ఇంచార్జ్  దేవేంద్ర యాదవ్  అంటున్నారు.  ఈ పరిణామాలను గమనిస్తే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్దానికి రంగం సిద్ధమైంది చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ- జేడీయు సారధ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-ఆర్జేడీ సారధ్యంలోని ఇండియా కూటమి సేనలు అస్త్ర శస్త్రాలతో యుద్ధానికి సిద్దమవుతున్నారు. అయితే  ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న కంటే.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ భవితవ్యం ఏమిటి? అనే ప్రశ్నేకీలకంగా మారింది.  ఓ వంక ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం గురించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.  మరో వంక నితీష్ కుమార్ మరో మారు ముఖ్యమంత్రి అవుతారా? అనే ప్రశ్న  రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అవును  అయారామ్, గయారామ్ రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచిన బీహార్ రాజకీయాల్లోనూ నితీష కుమార్  తన  విలక్షణత నిలబెట్టుకున్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రి గానే, కాదు, ఎక్కువ సార్లు  (9సార్లు)  ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగానూ చరిత్ర సృష్టించారు. నితీష్ కుమార్ 2005 నుంచి 2014 వరకు, తిరిగి   కొద్ది కాలం, ఆ తర్వాత  2015 నుంచి నేటి వరకు, మొత్తం మీద రెండు దశాబ్దాలకు కొంచెం అటూఇటుగా ముఖ్యమంత్రి కుర్చీకి అతుక్కు పోయారు. ‘ఫెవికాల్’ సిఎం’ అనిపించుకున్నారు.  అయితే  ఈ ఫెవికాల్ బంధం కొనసాగుతుందా? బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్  పదవ సారి  ప్రమాణ స్వీకారం చేస్తారా?  అనేది  ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.  నిజానికి  2020 ఎన్నికల్లో ఎన్డీఎ 37.23 శాతం ఓట్లతో 125 స్థానాలు గెలుచుకుంది. అందులో నితీష్ కుమార్ పార్టీ జేడీయుకు వచ్చింది కేవలం 43 సీట్లు మాత్రమే.  బీజేపీ 74 స్థానాలు గెలుచుకుంది. అయితే ఎన్డీఎ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందుగానే నితీష్ కుమార్ పేరును ప్రకటించినందున  నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎక్కువ సీట్లు వచ్చినా బీజేపీ  ఇచ్చిన  మాటకు  కట్టుబడి ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంది.  అయితే ఈసారి ముందుగానే ఎన్డీఎ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించేందుకు బీజేపీ అంత సుముఖంగా ఉన్నట్లు లేదు. అంటే ఎన్డీఎకి  మెజారిటీ వస్తే మహారాష్ట్ర తరహాలో  ఎక్కువ సీట్లు ఎవరికీ వస్తే వారికే ముఖ్యమంత్రి పదవి అనే ఫార్ములాను  బీహార్ లోనూ  అమలుచేసే ఆలోచనలో బీజేపీ ఉందని అనుకోవచ్చని అంటున్నారు. అయితే  ఇందుకు సంబంధించి బీజేపీ నాయకులను ప్రశ్నిస్తే.. కర్ర విరగదు, పాము చావదు, అన్నట్లు  "మేము ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తాము" అని సమాధానం ఇస్తున్నారు. మరో వంక ఇదే ప్రశ్నను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అడిగినప్పుడు, ‘ఇక్కడ’ చెప్పే విషయం కాదు అంటూ మీడియా ప్రశ్నను దాటవేశారు. సో.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి గత ఎన్నికల్లోలాగా ఎక్కువ సీట్లు కమల దళానికి దక్కితే.. ముఖ్యమంత్రి కుర్చీని వదులు కునేందుకు బీజేపీ సుముఖంగా లేదనేది స్పష్టంగానేతెలుస్తోందని అంటున్నారు.  మరోవంక గతంలోనే  బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ, ముఖ్యమంత్రి  నితీష్ కుమార్ ఉప రాష్ట్రపతి కావాలనేది తన కోరిక అంటే, తాజాగా  నిన్న మొన్న మరో బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే.  నితీష్ కుమార్ ను  ఉప ప్రధానిగా చూడాలనేది తన కోరిక అని పార్టీ మనసులో మాటను బయట పెట్టారు. అంటే  నితీష్ కుమార్’కు, బీజేపీ ఢిల్లీ ఫ్లైట్  టికెట్ బుక్  చేసినట్లే అనుకోవచ్చని అంటున్నారు.   అంటే  ఎన్డీఎ గెలిచినా, ఓడినా  నితీష్ కుమార్  కు మరో మారు  బీహార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇంచు మించుగా లేనట్లే అంటున్నారు. అలాగే, నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పీఠంతో ఉన్న ఫెవికాల్ బంధం...ఉంటుందా, ఊడుతుందా ? అంటే, అనుమానమే అన్న సమాధానమే వస్తోంది. అయితే.. హంగ్ వస్తే? మళ్ళీ నితీష్ కుమారే సిఎం అయినా కావచ్చు. ప్రస్తుతం అదే ఆసక్తికర ముక్తాయింపుగా పరిశీలకులు పేర్కొంటున్నారు.
బీహార్ బాబు నితీష్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా? Publish Date: Apr 11, 2025 12:38PM

హోం వర్క్ చేయలేదని విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్ 

మాతృదేవో భవ , పితృదేవో భవ తర్వాతి స్థానం ఆచార్య దేవో భవ అని అంటాం. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ఉపాధ్యాయురాలు విచక్షణ కోల్పోయింది.    సభ్య సమాజం  తలదించుకునేలా వ్యవహరించింది. హోం వర్క్ చేయలేదని ముగ్గురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయురాలు   గురువారం(ఏప్రిల్ 10) చెప్పుతో కొట్టింది. స్థానిక జీనియస్ పాఠశాలలో జరిగిందీ ఘటన. ప్రాథమిక పాఠశాలలో  రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయకపోవడంతో  ఉపాధ్యాయురాలు ఆగ్రహంతో ఊగిపోయింది ఉపాధ్యాయురాలు అనిత వారిని చెప్పుతో కొట్టి వార్తల్లోకి ఎక్కింది. విషయం తెలిసిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేశారు.   ఉపాధ్యాయురాలు అనితను నిలదీస్తూ  దాడి చేశారు. పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీంతో పాఠశాల వద్ద టెన్షన్  నెలకొంది.
హోం వర్క్ చేయలేదని విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్  Publish Date: Apr 11, 2025 12:19PM

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి.  మూల్యాంకనం, రీ వెరిఫికేషన్‌, కంప్యూటరీకరణ   ప్రక్రియలు పూర్తి కావడంతో ఫలితాలను శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.   ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ పరీక్షా ఫలితాలను ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌  https://bie.ap.gov.in/ లో  చూసుకోవచ్చు. అలాగే  గతంలో హాల్ టికెట్లను ఎలా అయితే మొబైల్ నంబర్లకు పంపించారో అలాగే ఈ సారి ఇంటర్ విద్యార్థులకు  పరీక్షా ఫలితాలను కూడా పంపిస్తారు. ఇందు కోసం ఏపీ విద్యార్థులు 9552300009 నంబర్ కు వాట్సాప్ మెసేజ్ పంపితే చాలు. వారి పరీక్షా ఫలితాలు వారి మొబైల్ కు వచ్చేస్తాయి.   
 రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు Publish Date: Apr 11, 2025 12:01PM

గోరంట్ల మాధవ్ పై మరో కేసు

హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ పై మరో కేసు నమోదైంది.  మంత్రి నారా లోకేష్ పై గురువారం (ఏప్రిల్ 10) గోరంట్ల మాధవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేశారు. జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారంటూ విమర్శలు చేసిన గోరంట్ల మాధవ్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందే తెలుగుదేశం కార్యకర్త చేబ్రోలు కిరణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ ను గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో అడ్డుకుని కిరణ్ పై దాడికి ప్రయత్నించిన గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో మరో కేసు నమోదైంది.
గోరంట్ల మాధవ్ పై మరో కేసు Publish Date: Apr 11, 2025 11:53AM

బోరు వేసినా  నీళ్లు రాకపోవడంతో తెలంగాణలో రైతు ఆత్మహత్య

ఆరుగాలం కష్ట పడిన రైతు గిట్టుబాటు లేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో  మరో  రైతు  గురువారం(10 ఏప్రిల్) పొద్దుపోయాక ఆత్మహత్య  చేసుకున్నాడు.  తన వ్యవసాయ భూమిలో నీళ్లు పడకపోతే మరో చోట బోర్ వేసినప్పటికీ నీళ్లు పడటం లేదు.   గత దశాబ్ద కాలం నుంచి  లక్షలాది రూపాయలు ఖర్చు చేసి 30 బోర్లు వేయించినా  ఎలాంటి ప్రయోజనం  లేకుండా పోయింది. దీంతో అప్పుల ఊబిలో చిక్కుక్కున్న 56 ఏళ్ల మల్నన్న సుసైడ్ చేసుకున్నాడు.  ఈ విషాద ఘటన  జిల్లాలోని లోకేశ్వరం మండలం, రాజురా గ్రామంలో జరిగింది. చనిపోయిన  మల్లన్నకు  తనకు వారసత్వంగా వచ్చిన ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన తన పొలంలో వరి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసేవాడు. పంటలు తరచూ ఎండిపోవడంతో  నీటి కోసం పలుమార్లు బోర్లు వేయిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చుచేశాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆత్మ హత్య చేసుకున్నాడు. 
బోరు వేసినా  నీళ్లు రాకపోవడంతో తెలంగాణలో రైతు ఆత్మహత్య Publish Date: Apr 11, 2025 11:45AM

అత్యుత్సాహంతో అడ్డంగా బుక్కైన తోపుదుర్తి!

రామగిరిలో వైసీపీ రచ్చ వెనుక కుట్ర కోణం?! మాజీ సీఎం జగన్‌ భద్రత కల్పించడంతో కూటమి సర్కారు విఫలమైందని చిత్రీకరించడానికి ఆ పార్టీ నేతలు గీసిన స్కెచ్ విఫలమైంది. ఈ నెల 8న జగన్‌ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్‌ వద్ద ఆ పార్టీ శ్రేణులు చేసిన అరాచకం వెనుక కుట్రకోణం దాగున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే హెలిప్యాడ్‌ వద్ద వేలమందితో వీరంగం సృష్టించి.. దాన్ని మాజీ సీఎం జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. బారికేడ్లను తోసుకెళ్లడం, పోలీసులపై దాడి చేయడం, హెలికాప్టర్‌ వద్దకు నినాదాలు చేసుకుంటూ వెళ్లడం ముందస్తు ప్రణాళికలో భాగమేనని చెబుతున్నారు. వీటన్నింటినీ నిగ్గు తేల్చే క్రమంలో ఆరోజు హెలిప్యాడ్‌ వద్ద పోలీసుల మీద దాడి ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రకాశ్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టి, పోలీసులపై దాడికి ఉసిగొల్పినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ రామగిరి రావడం పార్టీ కార్యక్రమం కావడంతో ఏర్పాట్లన్నీ స్థానిక వైసీపీ నాయకులే చూసుకున్నారు. పోలీసులు భద్రత మాత్రమే కల్పించారు. 7న కుంటిమద్ది వద్ద హెలిప్యాడ్‌ను పరిశీలించిన పోలీసులు.. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు అత్యంత బలహీనంగా ఉన్నాయని, వాటిని మార్చి రెండంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. వైసీపీ నాయకులు వాటిని  పట్టించుకోలేదు. జగన్‌ హెలికాప్టర్‌ దిగిన వెంటనే వైసీపీ శ్రేణులు దూసుకురావడంతో బారికేడ్లు కిందపడిపోయాయి. దీనికితోడు పాపిరెడ్డిపల్లికి జగన్‌ కాన్వాయ్‌లోని 11 వాహనాలతోపాటు ముఖ్య నాయకుల వాహనాలను మాత్రమే అనుమతిస్తామనీ, ఎలాంటి జనసమీకరణ చేయవద్దని జిల్లా ఎస్పీ రత్న ముందు రోజు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు. వైసీపీ నాయకులు అవేమీ పట్టించుకోలేదు. పైగా అన్ని నియోజకవర్గాల నుంచి డబ్బులిచ్చి మరీ జనాలను తీసుకొచ్చారంట.  రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తమ అధినేత జగన్‌ మెప్పు కోసం పెద్దఎత్తున జనసమీకరణ చేశారు. ఎలాగైనా హెలిప్యాడ్‌ వద్దకు చేరుకోవాలంటూ ఆ రోజు ఉదయం నుంచే వాట్సప్‌ గ్రూపుల్లో సందేశాలు పంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దానికి తగ్గట్లే జగన్‌ రావడానికి కొద్ది నిమిషాల ముందే వేలమందిని హెలిప్యాడ్‌ వద్దకు తీసుకొచ్చారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి పార్టీ శ్రేణులను ఉసిగొల్పారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు పోలీసులపై దాడి చేశారు. దీంతో తీవ్ర అస్వస్థత పాలై చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు. మొత్తానికి జగన్‌ దృష్టిలో పడాలన్న తోపుదుర్తి అత్యుత్సాహం ఆయన్ని అలా బుక్ చేసిందిప్పుడు.  
అత్యుత్సాహంతో  అడ్డంగా బుక్కైన తోపుదుర్తి! Publish Date: Apr 11, 2025 11:24AM

పేరుకే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం.. కొత్త విమాన సర్వీసులు లేవు.. ఉన్న వాటికి మంగళం!?

ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నంలో విమానయానానికి పూర్వ వైభవం వస్తుందని అనుకుంటున్న తరుణంలో విశాఖ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సింది పోయి.. ఉన్న సర్వీసులే రద్దౌతున్నాయి. పేరుగొప్ప ఊరు దిబ్బ లా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం పరిస్థితి మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు రెండు సర్వీసులు ఇప్పటికే నిలిచిపోగా.. వచ్చే నెల నుంచి అంటే మే నుంచి  బ్యాంకాక్‌ , కౌలాలంపూర్‌ సర్వీసులూ రద్దు కానున్నాయి. ఇప్పటికే వాటి బుక్కింగులను నిలిచిపోయాయి. గతంలో అంటే  కొవిడ్‌ సమయంలో నిలిచిపోయిన దుబాయి విమాన సర్వీసు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఉన్నవి కూడా రద్దు అవ్వడంపై   పారిశ్రామికవేత్తలు, నాయకులు, వి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా ఉత్తరప్రదేశ్ కు చెందిన రామ్మోహన్‌నాయుడు దీనిపై దృష్టి పెట్టి రద్దైన సర్వీసులను పునరుద్ధరించడం, కొత్త సర్వీసుల ప్రారంభంపై దృష్టి సారించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. విశాఖ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌లకు నేరుగా విమాన సర్వీసులు గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి. వారంలో మూడేసి రోజులు ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కంబోడియా, చైనా, హాంకాంగ్, ఇండోనేసియా, జపాన్, లావోస్, మకావ్, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లేవారికి వీటి వల్ల ప్రయోజనం  కలుగుతుంది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న కారణంగా జనవరిలో కౌలాలంపూర్‌ సర్వీసును నిలిపివేయాలని ఆ సంస్థ భావించగా..  కేంద్ర మంత్రి చొరవతో సేవలు కొనసాగించారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 74.4 శాతం పెరిగింది. 8,415 మంది మలేసియా, కౌలాలంపూర్, సింగపూర్‌కు రాకపోకలు సాగించారు. తాజాగా మే మొదటి వారం నుంచి ఈ సర్వీసులకు టికెట్ల బుకింగ్‌ నిలిపివేశారు. ఇక్కడి నుంచి ఉమ్మడి విశాఖతోపాటు తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోతే వారంతా హైదరాబాద్, చెన్నై వెళ్లి.. అక్కడి నుంచి బ్యాంకాక్, మలేసియాలకు ప్రయాణించాలి. విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు పెరిగిన నేపథ్యంలో గతేడాది అక్టోబరులో రెండు కొత్త సర్వీసులు ప్రారంభించారు. దీంతో ప్రతిరోజు నేరుగా విజయవాడ వెళ్లేందుకు ఉదయం రెండు, సాయంత్రం ఒక సర్వీసు అందుబాటులో ఉండేవి. తాజాగా ఉదయం సర్వీసులు రద్దయ్యాయి. మిగిలిన రోజుల్లో విజయవాడకు రాకపోకలు సాగించేందుకు వందే భారత్‌ రైలు అందుబాటులో ఉంది. మంగళవారాల్లో వందేభారత్‌ కూడా లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణీకులు గగ్గోలు పెడుతున్నారు. 
పేరుకే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం.. కొత్త విమాన సర్వీసులు లేవు.. ఉన్న వాటికి మంగళం!?  Publish Date: Apr 11, 2025 11:14AM

రోగనిరోధక శక్తిని పెంచే టాప్ 7 టిప్స్ ఇవే..!

బలమైన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధులు,  దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి రక్షిస్తుంది.  రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది. కానీ నేటి కాలంలో జీవనశైలి, అంటువ్యాధుల ప్రమాదం పెరగడం,  తీసుకునే ఆహారంలో నాణ్యత లోపించడం వంటి కారణాల వల్ల చాలామందికి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా కోవిడ్-19 తరువాత చాలా మంది రోగనిరోధక శక్తి బలహీనంగా మారింది. అయితే ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని,  ఆరోగ్యం దృఢం చేసుకోవాలని ట్రై చేసేవారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికోసం ఇమ్యూనిటీని పెంచే టాప్ 7   టిప్స్ ఇక్కడ ఉన్నాయి. తెలుసుకోండి మరి.. పోషకాలు అధికంగా ఉండే ఆహారం.. సమతుల్య ఆహారం రోగనిరోధక ఆరోగ్యానికి తోడ్పడే అవసరమైన విటమిన్లు,  ఖనిజాలను అందిస్తుంది. విటమిన్ సి: సిట్రస్ పండ్లు, బెల్ పెప్పర్స్,  స్ట్రాబెర్రీలలో లభిస్తుంది, ఇది రోగనిరోధక కణాల పనితీరును పెంచుతుంది మరియు వాపును తగ్గిస్తుంది. విటమిన్ డి: విటమిన్ డి లోపం వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం పెరుగుతుంది . సూర్యరశ్మికి గురికావడం మరియు కొవ్వు చేపలు మరియు బలవర్థకమైన పాల ఉత్పత్తులు వంటి ఆహారాలు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. జింక్: గింజలు, చిక్కుళ్ళలో లభించే ఈ ఖనిజం రోగనిరోధక కణాల కార్యకలాపాలకు మరియు గాయం నయం కావడానికి మద్దతు ఇస్తుంది. ప్రోబయోటిక్స్: పెరుగు,  కిమ్చి, ఇడ్లీ,  దోస  వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి, ఇది రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యమైనది.  నాణ్యమైన నిద్ర.. రోగనిరోధక నియంత్రణకు నిద్ర చాలా కీలకం. దీర్ఘకాలిక నిద్ర లేమి వాపును పెంచుతుంది,  రక్షిత సైటోకిన్‌ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. రోగనిరోధక ప్రతిస్పందన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రాత్రికి 7–9 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.  శారీరక శ్రమ.. మితమైన వ్యాయామం రోగనిరోధక కణాల ప్రసరణను పెంచుతుంది. శరీరం వ్యాధికారకాలను మరింత సమర్థవంతంగా గుర్తించి పోరాడటానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు,  దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అధిక వ్యాయామం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. వారానికి 150 నిమిషాల వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి.. దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. రోగనిరోధక పనితీరును అణిచివేస్తుంది,  వాపుకు దారితీస్తుంది. ఒత్తిడిని నిర్వహించడానికి మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు, ప్రకృతిలో సమయం గడపడం,  అభిరుచులు,  సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ఉత్తమమైనవి. ఒత్తిడిని తగ్గించడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది,  రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. హైడ్రేటెడ్.. శరీరం నుండి పోషకాలను రవాణా చేయడానికి,  విషాన్ని తొలగించడానికి నీరు చాలా అవసరం.  శరీరం అంతటా రోగనిరోధక కణాలను తీసుకువెళ్ళే శోషరస ఉత్పత్తిని ప్రభావితం చేయడం ద్వారా డీహేడ్రేషన్ రోగనిరోధక పనితీరును దెబ్బతీస్తుంది .  వాతావరణాన్ని బట్టి ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. హెర్బల్ టీలు,  పుచ్చకాయ వంటి నీటితో కూడిన పండ్లు కూడా హైడ్రేషన్‌ను నిర్వహించడానికి సహాయపడతాయి.  పరిశుభ్రత,  టీకాలు వేయడం.. ఇన్ఫెక్షన్లను నివారించడానికి సరైన పరిశుభ్రత పాటించడం,  టీకాలు వేయించుకోవడం ముఖ్యం. చేతులు కడుక్కోవడం: సబ్బుతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వల్ల వైరస్‌లు,  బ్యాక్టీరియా వ్యాప్తి తగ్గుతుంది. టీకాలు: టీకాలు శరీరానికి నిర్దిష్ట వ్యాధికారకాలను గుర్తించి పోరాడటానికి శిక్షణ ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, వ్యాధి తీవ్రతను గణనీయంగా తగ్గిస్తాయి. ధూమపానం,  మద్యం .. ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీసి రోగనిరోధక కణాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర  సామర్థ్యం తగ్గుతుంది.   ధూమపానం,  మద్యం సేవించడం మానేయడం వల్ల రోగనిరోధక పనితీరు మొత్తం ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
రోగనిరోధక శక్తిని పెంచే టాప్ 7 టిప్స్ ఇవే..! Publish Date: Apr 11, 2025 10:58AM

భారతదేశంలో వ్యర్థాలు లేని గ్రామాల గురించి తెలిస్తే శభాష్ అంటారు..!

వ్యర్థాలు అంటే నిరుపయోగకరమైన వస్తువులు లేదా పదార్థాలు.  ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి ఇలాంటి వ్యర్థాలు ఎన్నెన్నో బయటకు వెళుతూ ఉంటాయి. ఇది చాలా సహజ విషయం అని అందరూ అంటారు. కానీ ఈ వ్యర్థాలే పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 62మిలియన్ టన్నులకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయట. దేశం అంతా ఇంత వ్యర్థాల మధ్య కుళ్లిపోతున్నా కొన్ని ప్రాంతాలలో మాత్రం నిశ్శబ్ద యుద్దం జరుగుతోంది. ఇవి కూడా ఏ పట్టణ ప్రాంతాలలోనో ఏ పర్యావరణ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నవో అనుకుంటే పొరపాటు పడినట్టే..  భారతదేశంలో ఆరు గ్రామాలు వ్యర్థాలు లేని గ్రామాలుగా మారి దేశం దృష్టిని తమ వైపు ఆకర్షిస్తున్నాయి. అసలు ఈ గ్రామాలు అలా ఎలా మారాయి అనే విషయం తెలుసుకుంటే.. భారతదేశంలో మారుమూల ప్రాంతాలలో ఉండే కొన్ని గ్రామాలు వ్యర్థాలే లేని  గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయి.  భారతదేశం మొత్తం మీద ఎంతో గర్వంగా గుర్తింపు పొందాయి. ఈ గ్రామాలలో పిల్లలు శుభ్రపరిచే కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారు. పెద్దలు సరళంగా జీవించడం గురించి జ్ఞానాన్ని పంచుకుంటారు. ఇక్కడ  "వ్యర్థం" అనే ఆలోచన నెమ్మదిగా కనుమరుగవుతోంది.  ఎందుకంటే ఇక్కడ ఏదీ వృధా కాదు. ఇవి కేవలం విధానాలే కాదు, ప్రజల కథలు కూడా. ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించే అట్టడుగు స్థాయి చర్య. ఇది శుభ్రమైన వీధుల గురించి మాత్రమే కాదు - ఇది పరిశుభ్రమైన భవిష్యత్తు గురించి కూడా చెప్తుంది. ఈ గ్రామాల గురించి తెలుసుకుంటే.. ఆంధి, జైపూర్, రాజస్థాన్.. జైపూర్ నుండి కొద్ది దూరంలో ఉన్న ప్రశాంతమైన ఆంధి గ్రామం అసాధారణమైన పని చేస్తోంది. ఈ గ్రామంలో వ్యర్థాలను స్వచ్ఛమైన అవకాశంగా మారుస్తోంది. వినూత్నమైన గ్రీన్ టెక్నాలజీల సహాయంతో ఇప్పుడు ఆహార వ్యర్థాలు,  వ్యవసాయ వ్యర్థాల నుండి ఆసుపత్రి వ్యర్థ జలాలను కూడా శక్తి, స్వచ్ఛమైన నీరు,  కంపోస్ట్‌గా మారుస్తోంది. బయోగ్యాస్ ప్లాంట్లు, సౌరశక్తితో నడిచే వ్యవస్థలు,  సహజంగా నీటిని శుద్ధి చేసే తడి భూములను ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. సైన్స్ నేతృత్వంలో,  ప్రజలచే శక్తిని పొందుతూ, గ్రామీణ భారతదేశం వ్యర్థాలు లేని  దిశగా మారడానికి చైతన్యం ఇస్తుంది. నయా బస్తీ, డార్జిలింగ్.. ఇదివరకు డార్జిలింగ్ కొండలలోని ఒక చిన్న గ్రామం నయా బస్తీ చెత్త కుప్పల కింద ఇబ్బంది పడుతుండేది. నేడు ఈ గ్రామం రూపు రేఖలు మారిపోయాయి.  దీనిని దాదాపుగా గుర్తించలేనంత అద్బుతంగా మారిపోయింది.  ఈ మార్పుకు  ఉట్సోవ్ ప్రధాన్,  అతని బృందం కీలకంగా ఉన్నారు. వారు తమ చేతులను చుట్టి సమాజంతో కలిసి పనిచేశారు. కంపోస్టింగ్ వంటి పురాతన పద్ధతులను తీసుకువచ్చారు. వాటిని పెర్మాకల్చర్ వంటి ఆధునిక ఆలోచనలతో కలిపారు.  వ్యర్థాలను జీవితంగా మార్చారు. ఇది ఇప్పుడు శుభ్రంగా ఉండటమే కాదు..  పచ్చగా, బలంగా ఉంది.  చోటా నరేనా, రాజస్థాన్.. ఒకప్పుడు ప్లాస్టిక్ కుప్పలు, కాలిపోతున్న వ్యర్థాల మధ్య పాతుకుపోయిన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని చోటా నరేనా గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కేవలం ఎనిమిది నెలల్లోనే. ఒకప్పుడు కలుషితమైన ఈ గ్రామం రాష్ట్రంలో మొట్టమొదటి వ్యర్థ రహిత గ్రామంగా  మారింది - ఇదంతా అక్కడ నివసించే ప్రజల వల్లే సాధ్యమైంది. పటోడా, మహారాష్ట్ర.. మహారాష్ట్ర నడిబొడ్డున ఉన్న పటోడా గ్రామం సుస్థిర జీవనం అంటే ఏమిటో చూపిస్తుంది. ఇక్కడ,వ్యర్థాలను బయట పడేయడం కాదు - వాటిని పనిలో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఇల్లు తన వ్యర్థాలను క్రమబద్ధీకరిస్తుంది. వంటగది వ్యర్థాలను పొలాలకు ఎరువుగా మారుస్తుంది.  ప్లాస్టిక్,  పొడి వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ కోసం విక్రయిస్తుంది, ఇది గ్రామ ఆదాయాన్ని పెంచుతుంది. మేలతిరుప్పంతురుతి, తమిళనాడు.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన పట్టణ పంచాయతీగా మేలతిరుప్పంతురుతి పేరు సంపాదించింది. ఈ పట్టణం వ్యర్థాలను మూలంలోనే క్రమబద్ధీకరిస్తుంది. సేకరణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తుంది. నివాసితులకు ఉచితంగా మొక్కలను అందజేస్తారు.  బయోడిగ్రేడబుల్ బ్యాగుల కోసం ప్లాస్టిక్‌ను తొలగించమని ప్రోత్సహిస్తారు. ఇది పనిచేసే సరళమైన, సమాజ-ఆధారిత వ్యవస్థ. ఇంట్లోనే పెద్ద మార్పు ఎలా ప్రారంభమవుతుందో చూపించే చిన్న పట్టణం.  అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్.. ఒకప్పుడు 15 ఎకరాల విస్తీర్ణంలో భారీ చెత్తకుప్పగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ కథను పూర్తిగా మార్చేసింది. నేడు ఇది భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి.  ఇక్కడ ప్రతి ఇల్లు చెత్తను వేరు చేస్తుంది.  ఒక్క చెత్త కూడా చెత్తకుప్పలో పడదు.   *రూపశ్రీ  
భారతదేశంలో వ్యర్థాలు లేని గ్రామాల గురించి తెలిస్తే శభాష్ అంటారు..! Publish Date: Apr 11, 2025 10:56AM

హెలికాప్టర్ నదిలో కూలి ఆరుగురు దుర్మరణం.. మృతుల్లో ఐటీ కంపెనీ సీఈవో కుటుంబం

అమెరికాలో  హెలికాప్టర్ నదిలో కూలిన సంఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో జర్మనీకి చెందిన ఐటీ కంపెనీ హెడ్ కుటుంబం మొత్తం మరణించింది.  జర్మనీకి చెందిన టక్నాలజీసంస్థ స్పెయిన్ విభాగం హెడ్, సీఈవో అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నదిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ లో ఉన్న ఆరుగురూ అంటే.. ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురుపిల్లలు, పైలట్ మరణించారు.  ఈ ప్రమాద ఘటనపై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
హెలికాప్టర్ నదిలో కూలి ఆరుగురు దుర్మరణం.. మృతుల్లో ఐటీ కంపెనీ సీఈవో కుటుంబం Publish Date: Apr 11, 2025 10:38AM

అలవి కాని అమ్మ సామెతలా జగన్ తీరు

అనగనగా ఒక ఊళ్లో ఒకామె ఉంది. మహా రచ్చలమారి మనిషి. ఆమెతో ఎంత మర్యాదగా ప్రవర్తించినా కూడా ఏదో ఒక రకంగా దాన్ని గొడవగా మార్చేస్తుంది. ఎలాగంటే.. ఆమెను ఎవరైనా ‘అమ్మా’ అని పిలిస్తే.. ‘ఠాట్.. నన్ను అమ్మా అంటావా.. అంత ముసలిదానిలా కనిపిస్తున్నానా.. నేనేమైనా నీ అయ్యకు పెళ్లాన్నా..’ అంటూ గొడవకు దిగుతుంది. అలాకాకుండా, ‘ఏమండోయ్..’ అని పిలిస్తే.. ‘నేనేమైనా నీకు పెళ్లాన్నా.. అంత చనువుగా పిలుస్తున్నావ్’ అంటూ దానికి కూడా గొడవకు దిగుతుంది. అలాంటి వారి గురించి ‘అలవిగాని ఆడదాన్ని అమ్మా అన్నా తప్పే.. ఏమేవ్ అన్నా తప్పే..’ అంటూ పల్లెపట్టుల్లో ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు గమనిస్తే అంతకంటె భిన్నంగా ఏమీ లేదు. పాపిరెడ్డి పల్లె పర్యటనకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి పోలీసుల భద్రత, రక్షణ అడిగారు.. పోలీసులు ఏకంగా ఇద్దరు ఎస్పీల ఆధ్వర్యంలో 1100 మంది పోలీసులో ఆ ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఈ సామెత కథ మాదిరిగా ఆయన అనుసరించిన ధోరణిని ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి.  జగన్  భద్రతను దృష్టిలో పెట్టుకోవడం వల్లనే పోలీసులు ఆయన అడిగిన చోట కాకుండా.. పాపిరె డ్డిపల్లెకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ కుఅనుమతి ఇచ్చారు. పైగా హెలిప్యాడ్ వద్దకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ రావొద్దని నెత్తీ నోరూ బాదుకుని చెప్పారు. కానీ.. జగన్ రాకకు జనాన్ని తరలించిన స్థానిక నాయకులు మాత్రం.. పోలీసుల మాట వింటే తాము వైసీపీ నాయకులు ఎందుకవుతాం అన్నట్టుగా వ్యవహరించారు. తరలించి తీసుకువచ్చిన జనాలనందరినీ హెలిప్యాడ్ వద్దకు కూడా తోలారు. తీరా అక్కడి పరిస్థితి ఏమిటి? జనం మిక్కిలిగా వచ్చేశారు.. వారిని అదుపు చేయడానికి పోలీసులు ఏ కొంచెం కఠినంగా వ్యవహరించినా సరే.. ‘మా కార్యకర్తల్ని కొట్టేస్తున్నారు.. మా మీద పోలీసులు దాడిచేస్తున్నారు..’ అంటూ గోల చేయాలన్నది వారి కోరిక. అప్పటికీ పోలీసులు జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తే.. పోలీసులమీదనే రాళ్లురువ్వి దాడికి దిగారు. అప్పటికీ.. పోలీసులు సంయమనం కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.  తీరా జనం తాకిడి వల్ల హెలికాప్టర్ కాస్త దెబ్బతింది. తీరా ఇప్పుడు ‘పోలీసులు సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదు. జనం వస్తోంటే చూస్తూ కూర్చున్నారు..’ అని మళ్లీ పోలీసుల మీదనే నిందలేస్తున్నారు.  జగన్ వ్యవహార సరళిని గమనిస్తే.. పాపిరెడ్డి పల్లిలో పోలీసులు ఎంత పటిష్ఠ ఏర్పాట్లు చేసినా సరే.. ఏదో ఒక రకంగా వారి మీద నిందలు వేయాలని, శాంతిభద్రతలు విఫలమవుతున్నాయని ప్రభుత్వం మీద బురద చల్లాలని ముందే ఫిక్సయిపోయి అక్కడకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. బట్టలూడదీసి కొడతానని జగన్ కారుకూతలు కూసినా సరే.. పోలీసులు సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. జగన్ మాత్రం.. ముందే రెండు స్క్రిప్టులు తయారుచేసుకుని ఉన్నట్టుగా.. అంతా ప్రశాంతంగా జరిగినా సరే.. హెలిపాడ్ వద్ద జనం తాకిడి గురించి తమ పార్టీ నాయకులు చేసిన తప్పిదానికి పోలీసులను నిందిస్తున్నారు. హెలిపాడ్ వద్ద గుమికూడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరి మీద పోలీసులు కేసు పెట్టి, అందరికీ నోటీసులు ఇస్తేగానీ ఆపార్టీ కుట్రలు బయటకురావని, వారి లేకిబుద్ధులు బయటపడవని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
అలవి కాని అమ్మ సామెతలా జగన్ తీరు Publish Date: Apr 11, 2025 10:16AM

కమలాన్ని ఖతం చేస్తా.. రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ!

కాంగ్రెస్ అధిష్ఠానం మనసు గెలిచేశారా? కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి సిద్దమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత గడ్డ గుజరాత్ నుంచి శంఖారావం పూరించింది. అహ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రెండు రోజుల విస్తృత స్థాయి సమావేశంలో న్యాయ్ ఫథ్ పేరిట ఆమోదించిన తీర్మానం  పై జరిగిన చర్చలో  మోదీని ఓడించడమే లక్ష్యం అన్నట్లుగా నేతల ప్రసంగాలు సాగాయి.  ఎఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా దేశం నలుమూలల నుంచి వచ్చిన 1200 మంది  కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు బీజేపీ విధానాలు, మోదీ ప్రభుత్వ  వైఫల్యాలను ఎండగడుతూ ప్రసంగించారు. ప్రధానంగా బీజేపీని ఓడించడం, మోదీని గద్దె దించడం లక్ష్యంగానే చిన్న,పెద్ద నేతలంతా ప్రసంగించారు. ఏఐసీసీ అధ్యక్షుడు, మల్లిఖార్జున ఖర్గే సహా ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ పునర్జీవనం పొందుతుందనే విశ్వాసం వ్యక్త పరిచారు. అలాగే  ఈసారి ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీని ఓడిస్తామని లోక్ సభ సాక్షిగా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రతిజ్ఞను నేతలు పునరుద్ఘాటించారు. ముఖ్య నేతలు, రాహుల్ గొంతుతో గొంతుతో కలిపి  గుజరాత్ నుంచి జైత్ర యాత్ర మొదలవుతుందన్న విశ్వాసం వ్యక్తపరిచారు.  నిజానికి ఖర్గే మొదలు కీలక నేతలు చేసిన ప్రసంగాలలో కొత్తదనం పెద్దగా కనిపించ లేదు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి మాత్రం  కొంత భిన్నంగా, కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగతున్న రాజకీయ పోరాటానికి సైద్ధాంతిక వారసత్వాలను జోడింఛి ఉద్రేక పూర్వక  ప్రసంగం చేశారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగతున్న రాజకీయ పోరాటాన్ని, గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు జరుగతున్న పోరాటంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అయితే  రేవంత్ రెడ్డి బీజేపీ సంఘ్ పరివార్  పై చేసిన ఘాటు విమర్శలలో మరో రాజకీయ కోణం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.  బహుశా,పూర్వాశ్రయంలో ఆయనకున్న కాషాయ బంధాలకు సంబంధించి వినవస్తున్న ఆరోప ణలు,అనుమానాల నివృత్తి కోసం  రేవంత్ రెడ్డి  ఎఐసీసీ వేదిక నుంచి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని  పరిశీలకులు పేర్కొంటున్నారు. అందుకే,  బీజేపీ,ఆర్ఎస్ఎస్  ఐడియాలజీని అంతం చేయ డమే తమ లక్ష్యమని, మరో అడుగు ముందుకేసి  దేశాన్ని దుర్మార్గంగా పాలించిన ఆంగ్లేయుల కంటే గాంధీని చంపిన గాడ్సే వారసులైన బీజేపీ నాయకులతోనే ఈ దేశానికి మరింత ప్రమాదం పొంచి ఉందని  ఘాటైన విమర్శలు చేశారని అంటున్నారు. అలాగే   అహ్మదాబాద్ స్పూర్తితో  తెలంగాణలో బీజేపీని  కాలు పెట్టనీయనని, ఖతం చేస్తామని శపధం చేయడం  కూడా శీల పరీక్షలో భాగంగానే పేర్కొంటున్నారు. అలాగే  రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం  తెలంగాణలో  రైతు రుణ మాఫీ చేశామనీ, రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీచేసి, లక్షలాది రైతులను రుణ విముక్తులను చేశామని చెప్పారు. అలాగే  కుల గణన ప్రస్తావన చేశారు. ఇందుకు అనుగుణంగా  రిజర్వేషన్ల పెంపును అనుమతించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం, ఢిల్లీ జంతర్ మంతర్  వద్ద ధర్నా చేశామని చెప్పారు.  నిజానికి, ఇతరుల ప్రసంగాలతో పోలిస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగం, కొంత భిన్నంగా ఉండడమే కాకుండా, లక్ష్య నిర్దేశంతో, టార్గెటెడ్ గా సాగిందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, ఆయన లక్ష్యం కూడా కొంత నెరవేరినట్లేనని అంటున్నారు. గత కాలంగా   రేవంత్ రెడ్డి బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, మరీ ముఖ్యంగా  కారాణాలు ఏవైనా, కారణం ఎవరైనా, రాహుల్ గాంధీలోనూ అలాంటి అనుమాన బీజాలు నాటుకున్నాయని, అలాంటి అనుమానాలే ఉన్నాయనే సంకేతాలు వస్తున్న నేపధ్యంలో  రేవంత్ రెడ్డి ఏఐసీసీ వేదికను ఉపయోగించుకున్నారని అంటున్నారు. అలాగే  రాహుల్ గాంధీ సమక్షంలో  బీజేపీ, ఆర్ఎస్ఎస్  ఐడియాలజీని వ్యతిరేకించడంలో  తాను ఎవరికీ తీసిపోనని నిరూపించుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తునారు. అంతే కాకుండా ఈ ప్రయత్నంలో ఆయన కొంత వరకు సక్సెస్  అయ్యారని కూడా పరిశీలకు భావిస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవను మెచ్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం  కుల గణన విజయవంతంగా చేయడంతో పాటుగా  కులగణన ఆధారంగా బీసీల  రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరుతూ, అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని రాహుల్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.అంతేకాకుండా, అంతటితో ఆగకుండా  ఢిల్లీలో పోరాటం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రయత్నాలను  ప్రశంసించారు. సో,  ఆమేరకు రేవంత్ రెడ్డి ప్రసంగం ఫలితం ఇచ్చిందనే అనుకోవచ్చును, అంటున్నారు.
కమలాన్ని ఖతం చేస్తా.. రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ! Publish Date: Apr 11, 2025 10:03AM

ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు నాయుడు

ఒంటిమిట్ట  కోదండ రాముడి కల్యాణోత్సవం శుక్రవారం (ఏప్రిల్ 11) సాయంత్రం జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా పుష్పాలంకరణకు 12 టన్నుల పూలను వినియోగిస్తున్నారు. కోదండరాముని కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తుల తరలి వస్తారన్న అంచనాలతో భక్తుల రద్దీ తగ్గట్టుగా ఏర్పాటు పూర్తయ్యాయి. భక్తుల భద్రత, సౌకర్యాలకు ఎక్కడా లోటు రాకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు.   సీతారాముల కల్యాణోత్సవాన్ని పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా కల్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేశారు. రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్ తదితర పనులు పూర్తయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. రాములోరి కల్యాణానికి భారీ సంఖ్యలో హాజరవుతున్న భక్తులకు.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు  తిరుమల తిరుపతి దేవస్థానం 70 వేల తిరుమల లడ్డూలను సిద్ధం చేసింది.  
ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు నాయుడు Publish Date: Apr 11, 2025 9:42AM

తెలంగాణకు భూకంప హెచ్చరిక!?

తెలంగాణకు  భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత చాలా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్, అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని.. ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది.  అయితే ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరూ కూడా ధృవీకరించని పరిస్థితి. ప్రభుత్వ వర్గాలు గానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించడం లేదు. భూకంపాలను కచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదనీ, ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్న మాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండు, మూడులో ఉన్నాయి. ఇవి తక్కువ నుంచి మోస్తరు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి. గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి. అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు.
తెలంగాణకు  భూకంప హెచ్చరిక!? Publish Date: Apr 11, 2025 1:33AM

ట్రంప్ వెనక్కి తగ్గింది అందుకేనా?

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గారు. చైనా మినహా అనేక దేశాలపై టారిఫ్‌ల అమలుకు 90 రోజుల విరామం ప్రకటించారు. సుంకాలపై ముందునుంచీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్లిన ట్రంప్‌.. ఇప్పుడు ఉన్నట్టుండి వాటిని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం బాండ్‌ మార్కెటే అంటున్నారు విశ్లేషకులు.  ఏప్రిల్‌ 2న భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్‌ . దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీ ఒడుదొడుకులను చవిచూశాయి. అయితే, ఈ టారిఫ్‌ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొనడంతో పాటు అంతర్జాతీయ మాంద్యం రావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని తోటి రిపబ్లికన్‌ నేతలు, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్ లు పదేపదే హెచ్చరించారు కూడా. అయినా అధ్యక్షుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.ఈ విషయంలో తన నిర్ణయం ఎప్పటికీ మారదు అని గట్టిగా చెప్పారు. ఆయనకు సర్ది చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అయితే, చివరి నిమిషంలో అనూహ్యంగా సుంకాలపై విరామం ప్రకటించడం గమనార్హం.  ట్రంప్‌ నిర్ణయం వెనక బాండ్‌ మార్కెట్‌ ఒక్కటే కారణమని తెలుస్తోంది. ఈ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలతో యూఎస్‌ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో మొదలైన ఆందోళనల వల్లే అధ్యక్షుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ ఆందోళనలను అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌.. ట్రంప్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. అటు ట్రెజరీ మార్కెట్‌లో వేగంగా జరుగుతున్న అమ్మకాల గురించి వైట్‌హౌస్‌ ఆర్థిక సలహాదారులు కూడా అధ్యక్షుడికి వివరించారట. ఇదిలాఉండగా టారిఫ్‌లపై విరామం ప్రకటించిన అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ బాండ్‌ మార్కెట్‌ గురించి ప్రస్తావించడం గమనార్హం. బాండ్‌ మార్కెట్‌ చాలా గమ్మత్తైనది. ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉంది. దీని భవిష్యత్తు గురించి ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అర్థమైంది. కొంత మంది కోపంగానూ ఉన్నారని ట్రంప్‌ అన్నారు.  కచ్చితమైన రాబడితో పాటు దీర్ఘకాలంలో నష్ట భయం తక్కువగా ఉండే పెట్టుబడి సాధనం బాండ్లు. వీటిని జారీ చేసే సంస్థలు మదుపర్ల దగ్గరి నుంచి నిధులు సమీకరించి ఒక నిర్దిష్ట కాలంలో ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం తిరిగి పెట్టుబడిని చెల్లిస్తాయి. బాండ్లు, స్టాక్స్‌ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటంటే.. కంపెనీలో స్టాక్‌హోల్డర్లకు ఈక్విటీ వాటా ఉంటుంది. అదే బాండు హోల్డర్లకు కంపెనీలో క్రెడిటార్‌ వాటా దక్కుతుంది. చాలా దేశాల్లో ప్రభుత్వంతో పాటు పలు కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఈ బాండ్లను జారీ చేస్తుంటాయి. ప్రభుత్వం జారీ చేసే బాండ్లకు సార్వభౌమ హామీ ఉంటుంది.
ట్రంప్ వెనక్కి తగ్గింది అందుకేనా? Publish Date: Apr 11, 2025 1:25AM

పోలీసుల అదుపులో గోరంట్ల మాధవ్

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పోలీసులు గోరంట్ల మాధవ్ ను గురువారం (ఏప్రిల్ 10) సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ జరిగిందేమిటంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా, మార్గ మధ్యంలో గోరంట్ల మాధవ్ పోలీసుల వాహనాన్ని అడ్డుకుని చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కిలిగించిన కారణంగా గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేశారు. 
పోలీసుల అదుపులో గోరంట్ల మాధవ్ Publish Date: Apr 10, 2025 6:16PM

పోయిన చోటే వెతుక్కుంటున్న కాంగ్రెస్

ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సుదీర్గ చరిత్రలో చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి చరిత్రలో ఎరగని ఘోరాతి ఘోరమైన ఓటమి. ఒకప్పుడు, 400 సీట్లకు పైగా గెలిచిన పార్టీ  నాలుగు పదులకు పడిపోయింది. లోక్ సభలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య  44 దగ్గర ఆగిపోయింది. ఓటు షేర్ –నిన్నమొన్నల్లో కుప్పకూలిన  షేర్ మార్కెట్’ కంటే ఘోరంగా కూలిపోయింది. అంతకు ముందు 2004,2009లో వచ్చిన ఓట్ల షేర్  కూడా మిగలలేదు.  అయితే, సీట్ల సంఖ్య తగ్గడం, ఓటు షేర్ పడిపోవడం మాత్రమే కాదు.. అంతకంటే ప్రమాదకరంగా కాంగ్రెస్ నిర్మించుకున్నసామాజిక సౌధం (సోషల్ బేస్) పునాదులు  కదిలి పోయాయి. అంతవరకు కాంగ్రస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సామాజిక వర్గాల్లో ఒక్క ముస్లింలు తప్ప  మిగిలిన సామాజిక వర్గాలు పార్టీ చేయి వదిలేసాయి. అయితే సామాజిక బంధాలు తెగిపోవడం అంతకు ముందు ఎప్పుడోనే మొదలైంది. అందుకే  1998 లో తొలిసారిగా పార్టీ పగ్గాలు చేపట్టిన సమయంలోనే సోనియా గాంధీ తమ తొలి ప్రసంగంలోనే, దళితుల, బహుజనులు, ఇతర వెనక బడిన తరగతుల ప్రజలు కాంగ్రెస్ కు దూరం అవడం వల్లనే  కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాదించలేక పోతోందని విశ్లేషించారు. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.  అయితే  ఆ తర్వాత ఇచుమించుగా రెండు దశాబ్దాలు ఆమె పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగినా  ఓ పదేళ్ళ పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో యూపీఎ సంకీర్ణ ప్రభుత్వలో ఆమె కీలక భూమిక పోషించినా  సామాజిక న్యాయ సాధనలో ఆశించిన ఫలితాలు రాలేదు. సామాజిక  వర్గాలు ఏవీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరలేదు. ఇప్పటికీ  పరిస్థితిలో మార్పు లేదు. అందుకే, ఓటమి వెంట ఓటమి కాంగ్రెస్ పార్టీని వెంటాడు తున్నాయి.ఇండియా కూటమి పుణ్యాన 2024 లోక్ సభ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు వచ్చినా.. ఆ తర్వాత జరిగిన ఐదారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఇందుకు ప్రధాన  కారణం  కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మలా, పెట్టని కోటలా నిలిచిన దళిత, బహుజన, బీసీ, ఓబీసీ, మైనారిటీలు,  కాంగ్రెస్ పార్టీకి దూరం కావడమే  కారణమని కాంగ్రెస్  పార్టీ మరో మారు గుర్తించింది.  ఈ నేపద్యంలో  అహ్మదాబాద్ (గుజరాత్) లో ఏప్రిల్ 8 - 9 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన అఖిల బారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం మరోమారు దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు  కాంగ్రెస్ నాయకులు మరో ప్రయత్నం చేశారు, ముఖ్యంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా కాలంగా చెపుతున్న కుల గణన, రిజర్వేషన్ల పెంపు అంశాలను మరింత వేగంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు  ఏఐసీసీ మరో మారు సంకల్పం చెప్పుకుంది. ముఖ్యంగా  రాహుల్ గాందీ దేశం ఎదుర్కుంటున్న సమస్యలు అన్నిటికీ బీసీ కుల గణన ఒక్కటే పరిష్కార మార్గమని చెప్పుకొచ్చారు. అలాగే  దళితులూ,ఆదివాసీల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. అంతే కాకుండా  ప్రైవేటు రంగంలోనూ బీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేశారు. అలాగే  ఏఐసీసీ సమావేశంలో ఆమోదించిన ‘న్యాయపథ్: సంకల్పం, సమర్పణ, సంఘర్షణ’  తీర్మానంలోనూ నిజమైన జాతీయ వాదం అనేది సామాజిక న్యాయం  లోనే ఉందని, స్పష్టంగా పేర్కొన్నారు.   ఇదొకటి అయితే.. ఏఐసీసీ సమావేశంలో ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో బీజేపీని ఓడించడం పార్టీ ముందున్నప్రధాన లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. అందుకే 64 ఏళ్ల తర్వాత  తొలిసారిగా ఏఐసీసీ సమావేశం అహ్మదాబాద్ నిర్వహించారు. అంతే  కాదు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా,  గుజరాత్ కు కాంగ్రెస్ ఎందుకు అవసరం అనే మకుటంతో ప్రత్యేక తీర్మానం చేశారు. ఏఐసీసీ సమావేశాల్లో ఇలా ఒక రాష్ట్రం కోసం ప్రత్యేకించి తీర్మానం చేయడం ఇదే తొలిసారి. దీన్ని బట్టిచుస్తే గుజరాత్ లో బీజేపీని ఓడించి అధికాంలోకి వచ్చేందుకు  కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రధాన్యత ఇస్తోందో స్పష్ట మవుతోంది. గుజరాత్ లో గత 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్  వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలిచితీరాలని, కాంగ్రెస్ పునర్జీవనానికి అదే తొలి మెట్టు కావాలని ఆశిస్తోందని అంటున్నారు. అందుకే  ఇప్పటికే, గుజరాత్ లో బీజేపీని ఓడిస్తున్నాం అని లోక్ సభలో ప్రకటించిన రాహుల్ గాంధీ, ఏఐసీసీ వేదిక నుంచి  ‘నూతన్ గుజరాత్ – నూతన కాంగ్రెస్’ నినాదాన్ని ఇచ్చారు. అయితే అది సాధ్యమా అంటే, కావచ్చును, కాక పోవచ్చును.కానీ,సంకల్పం మాత్రం అదే. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం...  గుజరాత్  ను గెలవాలి!
పోయిన చోటే వెతుక్కుంటున్న కాంగ్రెస్ Publish Date: Apr 10, 2025 5:21PM

రేణూదేశాయ్ పొలిటికల్ ఎంట్రీ.. కమలం పార్టీలోకేనా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రాజకీయాలలోకి ప్రవేశించనున్నారా?  ఆమె చూపు కమలం పార్టీవైపు ఉందా అంటే ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. తనకు రాజకీయాలంటే ఇష్టమన్న ఆమె, ప్రజాసేవ తన లక్ష్యమని చెప్పారు.  అంతే కాకుండా తానను తాను మోడీ భక్తురాలిగా చెప్పుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన విషయమేమిటంటే.. ఆమె మాజీ భర్త పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి. అలాగే పవన్ కూడా తరచూ మోడీని ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. దీంతో రేణూ దేశాయ్ బీజేపీ గూటికి చేరనున్నట్లు సంకేతాలివ్వడం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది.  పిల్లల కోసమే తాను ఇంత కాలం  రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రేణూదేశాయ్.. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాననీ, అందుకే తాను రాజకీయాలకు పనికిరానని అంతా అంటుంటారనీ, కానీ తాను పొలిటీషియన్ ని అవతానన్నది తన జాతకంలోనే ఉందని చెప్పడం ద్వారా పరోక్షంగా తన పొలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేసేశారు రేణూ దేశాయి
రేణూదేశాయ్ పొలిటికల్ ఎంట్రీ.. కమలం పార్టీలోకేనా? Publish Date: Apr 10, 2025 4:01PM

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్

బీఆర్‌ఎస్ మాజీ బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌‌కు వచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. ఓ రోడ్డు యాక్సిడెంట్ కేసు నుంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేసినందుకు షకీల్ పై పోలీసులు గతంలోనే  అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న షకీల్ దుబాయ్ వెళ్లిపోయి కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. షకీల్ భారత్ కు వస్తున్నారనే సమాచారంతో అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  2023లో షకీల్ కొడుకు రహేల్ వేగంగా కారు నడుపుతూ బేగంపేట ప్రగతి భవన్ ముందు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయగా.. తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ పోలీసులను తప్పుదోవ పట్టించారు. వెంటనే కొడుకును దుబాయ్ పంపించేశారు. కొడుకును తప్పించేందుకు, దుబాయ్ పారిపోయేందుకు షకీల్ సహకరించారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో షకీల్ పైనా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలిసి షకీల్ కూడా దుబాయ్ పారిపోయారు. గత కొంతకాలంగా దుబాయిలో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ కు పోలీసులు అనుమతిచ్చారని, పోలీసుల సమక్షంలో ఆయన అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం. అంత్యక్రియలు పూర్తయ్యాక షకీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్ Publish Date: Apr 10, 2025 3:37PM

ఏఐజీ హాస్పిటల్ కి కేసీఆర్

బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వచ్చారు. జనరల్ చెకప్‌లో భాగంగా కేసీఆర్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ‌లో జరగబోయే బీఆర్‌ఎస్ పార్టీ రజత్సోవాల్లొ  పార్టీ నాయకులతో కేసీఆర్ వరుస సమావేశలతో బీజీగా ఉండటంతో  అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.  గతంలో గులాబీ బాస్ ఏఐజీ హాస్పిటాల్‌‌కి వచ్చి హెల్త్ చెకప్ చేయించకున్నారు. సాధారణ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రజత్సోవాలను అధినేత ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో  పార్టీ కార్యకర్తల్లో ఉత్సహం నింపిటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్‌పార్టీ అధికారం కోల్పోయి తర్వాత నిర్వహించే  తొలి పార్టీ ఆవిర్బ సభ కావడంతో దీని విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ సభలో కాంగ్రెస్  ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కి సీట్లు రాకపోవడంతో క్యాడేర్ నిరాశతో ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సహం నింపాటానికి అధినేత ప్లాన్ చేస్తున్నారు.
ఏఐజీ హాస్పిటల్ కి కేసీఆర్ Publish Date: Apr 10, 2025 3:11PM

ఆర్జీవీపై రాజమహేంద్రవరంలో మరో ఫిర్యాదు

వివాదాస్పద దర్శకుడు రామగోపాల వర్మపై రాజమహేంద్రవరంలో ఒక ఫిర్యాదు నమోదైంది. ఆయన హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మేడా శ్రీనివాస్ రాజమహేంద్రవరం మూడో టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మతో పాటు యాంకర్ స్వప్నపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. వీరిరువూ సామాజిక మాధ్యమంలో హిందువులను కించపరిచేలా పోస్టులు పెట్టారని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఆధారాలను కూడా జతపరిచారు.  వీరిరువురూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు    సామాజిక భద్రతకు, జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని మెడీ శ్రీనివాస్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ  వ్యాఖ్యలలో హిందూ దేవుళ్ల పట్ల అమర్యాద కరంగా ఉన్నాయనీ, పవిత్ర గ్రంథాలైన మహాభారతం, రామాయణాలను అపహాస్యం చేసేవిగా ఉన్నాయనీ మేడీ శ్రీనివాస్ పేర్కొన్నారు.  
ఆర్జీవీపై రాజమహేంద్రవరంలో మరో ఫిర్యాదు Publish Date: Apr 10, 2025 3:04PM

కర్రెగుట్టలపై రెచ్చిపోయిన మావోయిస్టులు.. జవాను పరిస్థితి విషమం

చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. ప్రెషర్ బాంబు పేలిన వెంటన కూంబింగ్ చేస్తున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే  ప్రెషర్ బాంబు దాడికి ఒక జవానుకు తీవ్రగాయాలయ్యాయి. విషమ పరిస్థితిలో ఉన్న జవానును జిల్లా  ఆస్పత్రికి తరలించారు.  వచ్చే మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశం చేస్తామని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. చిన్న కె డి పాల్ వాగు దాటుతున్న జవాన్ల ను చూసిన మావోయిస్టులు బెదిరిపోయి ప్రెషర్ బాంబు పేల్చారు. . కర్రెగుట్టలపై రావొద్దని ఇప్పటికే మావోయిస్టులు బెదిరింపు లేఖ  విడుదల చేశారు.  కర్రెగుట్టలు ఎక్కువ భాగం చత్తీస్ గడ్ లో ఉంది. కొంత భాగం తెలంగాణ ములుగు జిల్లాలో ఉంది. కర్రెగుట్ట మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉంది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైన వెంటనే పోలీసులు   ఇక్కడ జల్లెడ పడుతున్నారు.   కర్రెగుట్టల్లో మాటు వేసిన మావోయిస్టుల ను మట్టు పెట్టడం అంటే పోలీసులు తమ ప్రాణాలను  రిస్క్ లో పెట్టినట్టే. ఓ వైపు మావోయిస్టులు శాంతి చర్చలకు ఆహ్వానిస్తూనే  జవాన్లపై ప్రెషర్ బాంబు పేల్చడం చర్చనీయాంశమైంది.   జవానుపై దాడి తర్వాత కర్రెగుట్ట ల్లో  మరో ఎన్ కౌంటర్ జరిగే అవకాశం ఉంది. సుమారు 100 కిలో మీటర్ల దూరం వరకు కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి.  ఇప్పటి వరకు జరిగిన ఎన్ కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. కాగా గురువారం జరిగిన ఘటనలో మావోయిస్టులు  పోలీసులపై  పై చేయిగా నిలిచారు.  
కర్రెగుట్టలపై రెచ్చిపోయిన మావోయిస్టులు.. జవాను పరిస్థితి విషమం Publish Date: Apr 10, 2025 1:27PM

ఒలింపిక్స్ లో క్రికెట్!

విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ లో మళ్లీ క్రికెట్ సందడి చేయనుంది. దాదాపు  128 ఏళ్ల తరువాత క్రికెట్ కు మళ్లీ ఒలింపిక్స్ లో స్థానం లభించనుంది. ఒలింపిక్స్ లో చివరి సారిగా 1900లో క్రికెట్ ఆడారు. అయితే ఆ తరువాత నుంచి ఒలింపిక్స్ కు క్రికెట్ దూరమైంది. ఇప్పుడు మళ్లీ క్రికెట్ ను ఒలింపిక్స్ క్రీడల జాబితాలో చేర్చడానికి నిర్ణయం తీసుకున్నది. ఒలింపిక్స్ అసోసియేషన్. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే టెస్ట్, వన్డే ఫార్మట్లలో కాకుండా టీ20 ఫార్మట్ లో క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చాలని నిర్ణయించారు. పురుషులు, మహిళల జట్లకు అవకాశం ఇచ్చారు.  అత్యంత జనాదరణ ఉన్న క్రికెట్ కు ఒలింపిక్స్ లో స్థానం కల్పించడం కచ్చితంగా క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషం కలిగిస్తుంది.  2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరిక ఒలింపిక్స్ కు మరింత ఆదరణ పెరగడానికి దోహదం చేస్తుందని క్రీడా పండితులు అంటున్నారు.
ఒలింపిక్స్ లో క్రికెట్! Publish Date: Apr 10, 2025 12:47PM

ముంబై బ్లాస్ట్ హంతకుడొచ్చాడు 

2008 ముంబై ఉగ్రదాడి సూత్రదారి తహవూర్ రాణాను అమెరికా అప్పగించింది. ప్రత్యేక విమానంలో రాణా ఇండియాకు బయలు దేరాడు. మరికొద్ది సేపట్లో రాణా భారత్ కు చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో రాణాను  ముందుగా ఎన్ ఐ ఏ అధికారులకు అప్పగించనున్నారు. అక్కడనుంచి రాణాను తీహార్ జైలుకు అప్పగించనున్నారు.  భారత్ లో జరిగిన ఉగ్రదాడుల్లో 26 నవంబర్ 2008 ఉగ్రదాడిని ఎవరూ మర్చిపోలేరు. నిన్న రాత్రి ఏడుగంటల పదినిమిషాలకు  ప్రత్యేక విమానంలో  అమెరికా నుంచి రాణా బయలు దేరాడు. 17 ఏళ్ల తర్వాత   భారత అధికారులు తీసుకొస్తున్నారు.  తహవూర్ రాణా ను ఎన్ఐఎన్ అధికారులు కస్టడీలో తీసుకునే  అవకాశం ఉంది. ఎన్ ఐ ఏ కార్యాలయంలో ఆయన్ని ప్రశ్నించనున్నారు.  తొలుత ముంబై పటియాల కోర్టు జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్నారు. భధ్రతా సమస్యల దృష్ట్యా ఆయన్ని ఆన్ లైన్ లో అప్పగించనున్నారు. లష్కర్ ఎ తోయిబా  ఉగ్ర సంస్థకు చెందిన రాణా రాక సందర్బంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా కేంద్రం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచింది. ట్రావెల్ సంస్థను నిర్వహించే రాణా అమెరికన్ ఉగ్రవాది హెడ్లీతో పరిచయమైంది . ఈ పరిచయంతోనే హెడ్లీ ముంబై వచ్చి రెక్కీ నిర్వహించాడు. రాణా  వస్తున్న సందర్బంగా తీహార్  జైల్లో భధ్రతను పెంచారు. ముంబై బ్లాస్ట్ లో  రాణా 160 మందిని  పొట్టన బెట్టుకున్నాడు. ఈ  మారణ హోమంలో  పాల్గొన్న మరో టెర్రరిస్ట్ కసబ్ కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది.  కసబ్ తరహా రాణాకు ఉరిశిక్ష అమలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది.
ముంబై బ్లాస్ట్ హంతకుడొచ్చాడు  Publish Date: Apr 10, 2025 12:35PM

మాజీ మంత్రి కాకాణిపై లుక్ ఔట్ నోటీసులు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధర్ నెడ్డిపై పొలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.  అలాగే ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ విచారణకు వాయిదా వేసింది. అరెస్టు నుంచి ఎటువంటి షీల్డ్ ఇవ్వలేమని స్పష్టం చేసింద. ఈ నేపథ్యంలో కాకాణిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసు జారీ చేయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని అంటున్నారు.   అక్రమ మైనింగ్ కేసులో   పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి  ఇప్పుడు  అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అజ్ణాతంలోకి వెళ్లడమే మార్గం. ఈ నేపథ్యంలోనే పోలీసలుు ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా  ఆయన నెల్లూరు జిల్లాలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని  పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో  ఏ4గా ఉన్న మాజీ మంత్రి కాకాణి  వరుసగా మూడు సార్లు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే  కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసుల తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.  హైదరాబాద్‌, నెల్లూరు సహా.. మరికొన్ని ప్రాంతాల్లో కాకాణి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే కాకాణిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్ పోర్టులు, సీపోర్టులకు సమాచారం ఇచ్చారు. ఆయన కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఆరు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 
మాజీ మంత్రి కాకాణిపై లుక్ ఔట్ నోటీసులు Publish Date: Apr 10, 2025 11:15AM

ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇల్లు లేదు..!

అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ ఇళ్లు కట్టిస్తాం.. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు  చేసే ప్రధాన వాగ్దానాలలో ఇదొకటి.  పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లోనూ  అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల్లో ఇంటి’  హామీ గ్యారెంటీ’గా ఉంటుంది. అయితే, పేర్లు మారుతూ ఉంటాయి. ఒకరు ఇందిరమ్మ ఇళ్లు, అంటే ఇంకొకరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటారు. ఇంకొకరు  డబల్ బెడ్  రూమ్ హామీ ఇస్తారు.  అయితే  ఇచ్చిన హామీలను అమలు చేసే ఆచారం మన రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు పెద్దగా లేదు కనుక  పేదోడి సొంత ఇంటి కల, ప్రతి మేనిఫెస్టోలోనూ ఉంటుంది కానీ  భూమి మీద కనిపించదు. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ కల ఎప్పటికీ అలా పగటి కలగానే మిగలి పోతోంది. కొద్ది మంది అదృష్ట వంతులకు మినహా పేదలు అందరికీ ఇల్లు అనే లక్ష్యం  ఇంత వరకు నెరవేర లేదు. ఇక ముందు నెరవేరుతుందన్న ఆశ కూడా లేదు.  పేదల సంగతి సరే.. కానీ,ఇప్పడు సమస్య పేద ప్రజలది కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే ఇంటి సమస్య వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం లేక అవస్థలు పడుతున్నారు. అవును. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా  అధికార బాధ్యతలు చేపట్టి 50 రోజుల పైనే అయింది. అయినా ఇంతవరకు ఆమెకు అధికారిక నివాసం కేటాయింపు జరగలేదు. సో .. చేసేది లేక ఆమె షాలిమార్‌ బాగ్‌లోని తమ సొంత ఇంటి నుంచే’ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే  షాలిమార్ భాగ్  నుంచి సచివాలయానికి వెళ్ళాలంటే  పాతిక కిలో మీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది ఆమెకు  మాత్రమే కాదు సామాన్యులకు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది.   ట్రాఫిక్ అంక్షల కారణంగా అదే దారిలో ప్రయాణించే సామాన్య ప్రజలకు కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటోంది. అలాగ.. షాలిమార్ బాగ్ లో ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న  ప్రాంతం భద్రతాపరంగా, ఇతరత్రా అంత అనువుగా లేదని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి  ప్రస్తుత వాసంలో  వాహనాల పార్కింగ్ కు తగినంత స్థలం లేదు. దీంతో ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చి పోయే ప్రజలు,  వీఐపీలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే,ముఖ్యంత్రి రేఖా గుప్తా త్వరగా  ఓ ఇల్లు చూసుకోవాలని ఇటు ప్రజలు, అటు అధికారులు కూడా కోరుకుంటున్నారు.  నిజానికి  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ముందు చూపుతో సర్వ సదుపాయాలు, సర్వ సౌకర్యాలతో ముఖ్యంత్రి అధికార నివాసం  షీష్ మహల్  కట్టించారు. అయితే, షీష్ మహల్   నిర్మాణానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున  దుర్వినియోం చేసిందని  అప్పట్లో బీజేపీ ఆరోపించింది. ఆరోపణల్లో ఎంత నిజం వుందో  తెలియదు కానీ  మొన్నటి ఎన్నికల్లో ఆప్’ ఓటమికి షీష్ మహల్  (అద్దాల మేడ) పై వచ్చిన ఆరోపణలు కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచాయి.  సో.. అన్నిఅరోపణలు చేసి  అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి  ఇంచక్కా వెళ్లి షీష్ మహల్లో సెటిలైపోతే  పరువు అసలు దక్కదని  బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. నిజానికి  ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్  రాజీనామా చేసిన తర్వాత కొద్ది కాలం తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి  కూడా షీష్ మహల్ లో కాలు పెట్టలేదు.  అదలా  ఉంటే ఇప్పడు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తమ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న సివిల్‌ లైన్స్‌ లేదా లుటియెన్స్‌ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లుటియెన్స్‌ ప్రాంతంలో నివాసం కావాలంటే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి అవసరం. దీంతో అధికారిక నివాసం కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు.ఇప్పటికే ప్రతిపక్ష నేత  మాజీ ముఖ్యమంత్రి అతిషి, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు అందరికీ అధికార నివాసాలు కేటాయించిన అధికారులు, ముఖ్యమంత్రి ఇంటి సమస్యకు మాత్రం ఒక పరిష్కారం చూపలేక పోతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇల్లు లేదు..! Publish Date: Apr 10, 2025 11:07AM

ఎరుపు, నలుపు...  ఏ మట్టికుండలలో నీరు చల్లగా ఉంటుందంటే..!

ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకోవడంతో రాబోయే నెలల ఉష్ణోగ్రత  గురించి ఆందోళన చెందుతున్నారు. చాలామంది ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి, చల్లటి నీటి కోసం  తాపత్రయ  పడుతుంటారు. మారుతున్న కాలంతో పాటు కూలింగ్ వాటర్ కోసం వాటర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు వంటి పరికరాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ చాలామందికి కుండల మట్టి ప్రాధాన్యత, వాటి ఉపయోగం చాలా స్పష్టంగా అవగాహన ఉంది. అందుకే ఇంట్లో రిఫ్రిజిరేటర్లు ఉన్నా సరే..   మట్టి కుండలు కొంటూ  ఉంటారు.   గ్రామీణ ప్రాంత ప్రజలు అయినా,  పట్టణ ప్రాంత ప్రజలు అయినా   మట్టి కుండలను కొని అందులో నీరు తాగుతుంటారు.  ఎందుకంటే ఈ మట్టి  కుండలు నీటిని సహజంగా చల్లబరుస్తాయి. మట్టి కుండ  నీరు తాగడం వల్ల శరీరంలో ఎటువంటి కాలానుగుణ రుగ్మతలు ఏర్పడవు. కానీ  మార్కెట్లో రెండు రకాల మట్టికుండలు కనిపిస్తూ ఉంటాయి.  ఒకటి ఎరుపు రంగు కాగా.. మరొకటి నలుపు రంగు.  ఏ రంగు మట్టి కుండలు ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. దీనికి సరైన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నలుపు రంగు కుండ.. నలుపు రంగు వేడిని త్వరగా గ్రహిస్తుంది, అందుకే నల్ల కుండలోని నీరు త్వరగా చల్లబడుతుందని నమ్ముతారు. ఇది శరీరానికి కూడా మంచిది, అందుకే ఈ కుండకు భారీ డిమాండ్ ఉంది. ఎర్ర కుండ  కూడా మంచిదే అయినప్పటికీ, నల్లటి కుండతో  పోలిస్తే నీరు తక్కువ చల్లగా ఉంటుంది. అయితే, ఈ రోజుల్లో మట్టి కుండలు సిమెంట్‌తో కల్తీ చేయబడుతున్నాయి కాబట్టి దానిని కొనడానికి ముందు కుండను జాగ్రత్తగా పరిశీలించాలి. కల్తీని ఎలా గుర్తించాలి.. కుండ  కొనేటప్పుడు దాని బరువును తనిఖీ చేయాలి. నిజానికి మట్టి కుండలు తేలికగా ఉంటాయి, అయితే సిమెంట్ తో చేసిన కుండలు బరువుగా ఉంటాయి. అలాగే సిమెంట్ కలిపిన కుండలోని నీరు మట్టి కుండలోని నీరు అంత మంచిది కాదు. కాబట్టి, చల్లని  ఆరోగ్యకరమైన నీటి కోసం స్వచ్చమైన మట్టి కుండను ఎంచుకోవాలి. కుండ మందం.. మట్టి కుండల  షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా, మందంగా ఉండే కుండలు ఎంచుకోవాలి నిజానికి ఇది నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. సన్నని  మందం ఉన్న కుండలు సులభంగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కుండను కొనుగోలు చేసేటప్పుడు దాని మందంపై  శ్రద్ధ వహించాలి. లీక్ టెస్ట్.. తరచుగా ప్రజలు మట్టి కుండ  కొనేటప్పుడు తొందరపాటులో లీక్ టెస్ట్ చేయడం మర్చిపోతారు.  తరువాత ఇంటికి వచ్చి కుండను నీటితో  నింపినప్పుడు కుండ లీకవ్వడం చూసి బాధపడతారు. కాబట్టి దుకాణంలోనే నీటిని పోసి లీక్ టెస్ట్ చేయాలి. ఎక్కడి నుంచో నీళ్లు కారుతుండటం తెలుసుకోవచ్చు.  ఇలా చేయడం వల్ల  మళ్లీ మళ్లీ షాపుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ తప్పులు చేయకండి.. తరచుగా  అందానికి ఆకర్షితులై, మరింత మెరిసే కుండలను కొంటారు. అయితే ఈ కుండలపై పెయింట్ వేయడం వల్ల నీరు అంత చల్లగా మారదు. కుళాయి ఉన్న కొంచెం పెద్ద కుండ కొనండి. దీనితో,  కుండను పదే పదే నింపాల్సిన అవసరం ఉండదు.  నీటిని బయటకు తీయడానికి దాన్ని తెరవాల్సిన అవసరం ఉండదు. ఇది నీటిని స్వచ్ఛంగా,  చల్లగా ఉంచుతుంది.   *రూపశ్రీ.
ఎరుపు, నలుపు...  ఏ మట్టికుండలలో నీరు చల్లగా ఉంటుందంటే..! Publish Date: Apr 10, 2025 10:54AM

చంద్రబాబు నివాసంపై దాడి కేసు.. జోగి రమేష్ కు సీఐడీ నోటీసులు

ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపకా తప్పదన్నా అన్నట్లు జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగి.. ఎదురేలేదన్నట్లుగా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్  ఇప్పుడు వాటి ఫలితాన్ని అనుభవించక తప్పని పరిస్థితుల్లో పడ్డారు. గతంలో చేసిన తప్పిదాలకు   మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్ధితిలో ఉన్నారు. అగ్రీగోల్డ్ భూ కుంభకోణంలో జోగి రమేష్ కుమారుడు అరెస్టై బెయిలు మీద ఉన్నారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కూడా  తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో  ఇప్పటికే  పోలీసుల విచారణకు హాజరైన జోగి రమేష్ కు సీఐడీ పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ సారి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ కు  నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం (ఏప్రిల్ 11) విచారణకు హాజరు కావాల్సిందిగా  ఆ నోటీసులలో పేర్కొన్నారు.  జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. గురివింద గింజ సామెతలా.. తాను ఓ వైపు అక్రమాలకు పాల్పడుతూ, భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ.. అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ అప్పట్లో అధికారం అండతో పాల్పడిన అక్రమాలకు, దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితుల్లో పడ్డారు.  
చంద్రబాబు నివాసంపై దాడి కేసు.. జోగి రమేష్ కు సీఐడీ నోటీసులు Publish Date: Apr 10, 2025 10:53AM

ఆహారం తినేటప్పుడు ఈ పనులు చేస్తే బలంగా ఉంటారు..!

ఆయుర్వేదం భారతదేశంలోని ఒక పురాతన వైద్య విధానం. దీనిలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి చాలా మార్గాలు,   అన్ని వ్యాధులను వాటి మూలాల నుండి నిర్మూలించడానికి తీసుకునే చర్యలు క్షుణ్ణంగా వివరించబడి ఉన్నాయి.  ఆహారం తినడానికి సరైన పద్ధతులు కూడా ఆయుర్వేదంలో  వివరించబడ్డాయి. ఆహారం తీసుకునేటప్పుడు ఆయుర్వేదం 6 నియమాలను పాటించమని చెబుతుంది. ఈ నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాకుండా శరీరం చాలా బలంగా కూడా ఉంటుందట. కడుపు నిండుగా తినకూడదు.. పూర్తీగా ఆకలి తీరేలాగా కడుపు నిండుగా  ఎప్పుడూ తినకూడదట. 70-80 శాతం ఆకలి తీరి 75శాతం వరకు కడుపు నిండితే చాలట.  అలా చేస్తే ఆహారం జీర్ణరసంలో కలిసి బాగా  జీర్ణం కావడానికి కడుపు లోపల కొంత స్థలం ఏర్పడుతుందట.  ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం.. తీసుకునే భోజనం ఆ రోజులో అదే ఎక్కువ ఆహారం అయి ఉండాలి. అంటే దీని అర్థం.. రాత్రి భోజనం కంటే మధ్యాహ్నం తీసుకునే భోజనం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం సూర్యుడిని  అనుసరిస్తుందట.   మధ్యాహ్నం సమయంలో జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో పోషకాలున్న ఆహారాన్ని తినాలి. సమయం.. రాత్రి ఆలస్యంగా తినకూడదు. రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తుంది,  ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆహార స్థితి.. ఆహారం చల్లగా అయిన తరువాత  మళ్లీ వేడి చేయడం తప్పు. పాతబడిన లేదా మళ్లీ వేడిచేసిన ఆహారాన్ని తినకూడదు. పగటిపూట తయారుచేసిన ఆహారాన్ని రాత్రిపూట తినవచ్చు. కానీ రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని రోజుల తర్వాత   గ్యాస్ తో వేడి చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉపవాసం.. అజీర్ణంతో బాధపడుతుంటే ఆహారం తినకూడదట.  దీనికి బదులుగా  ఉపవాసం ఉండటం మంచిదట. అజీర్ణం చేసిందంటే అప్పటికే   తీసుకున్న భోజనం సరిగ్గా జీర్ణం కాలేదని అర్థం.  దీని వల్ల  తరచుగా కడుపు ఉబ్బరం వస్తుంటే  భోజనం మానేసి ఎండు అల్లం కలిపిన గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఉష్ణోగ్రత..  తీసుకునే ఆహారం స్థితి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.  ఆహారం పూర్తిగా ఉడికి, వేడిగా ఉండాలి. ఇది త్వరగా జీర్ణమై పోషకాలను అందిస్తుంది.                                    *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆహారం తినేటప్పుడు ఈ పనులు చేస్తే బలంగా ఉంటారు..! Publish Date: Apr 10, 2025 10:51AM

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ నుంచి చేబ్రోలు కిరణ్ సస్పెన్షన్

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతటితో ఆగకుండా మాజీ సీఎం సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేశారు.  మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే  వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ చేబ్రోలు కిరణ్ పై వేటు ద్వారా స్పష్టంగా చాటింది.  
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ నుంచి చేబ్రోలు కిరణ్ సస్పెన్షన్ Publish Date: Apr 10, 2025 10:38AM