దుబాయ్‌లోని 8 మంది ధనవంతులు...!!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఒకటైన దుబాయ్  చిన్నదేశమే అయినా సంపన్న దేశంగా గుర్తింపు పొందింది. దుబాయ్ లో వలసవాసులుగా భారతీయులు అందులో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. ఈ దేశంలో ఉన్న సంపన్నుల జాబితాలో ఉన్నవారిలో భారతీయుులు, భారతీయ సంతతికి చెందిన వారి సంఖ్య  ఎక్కు వే ఉంది.


1. ఉస్సేన్ సేజ్వాని (Hussain Sajwani)

అతని మొత్తం ఆస్తుల విలువ. 2.1 బిలియన్ డాలర్లు. సేజ్వాని, 2002 లో 'డమాక్ ప్రాపర్టీస్' అనే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ  స్థాపించాడు. అప్పటి నుండి ఇది యూరోప్ లో తన వ్యాపారాన్ని విస్తరించి ప్రముఖ సంస్థగా ఎదిగింది. సేజ్వాని రియల్ ఎస్టేట్ రంగంలో సాధించిన ప్రగతికి గాను అతన్ని అరేబియా బిజినెస్ రియల్ ఎస్టేట్ అవార్డులతో, అలాగే రియల్ ఎస్టేట్ లెజెండ్ బిరుదుతో సత్కరించారు. అలాగే 2018 సంవత్సరంలో గల్ఫ్  బిజినెస్ అవార్డులతో పాటు ఆ సంవత్సరపు రియల్ ఎస్టేట్ బిజినెస్ లీడర్ గా ఎన్నికైనాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి జాబితాలో అతని స్థానం 962.

2. సన్నీ వర్కీ.(Sunny Varkey)

ఇతని మొత్తం ఆస్తుల విలువ 2.6 బిలియన్ డాలర్లు. భారతీయుడైన సన్నీ బిలియనీర్ల జాబితాలో  స్థానాన్ని సంపాదించుకున్నాడు. జేమ్స్  విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా 250 పాఠశాలలను నిర్వహిస్తున్నాడు. అలాగే  ప్రపంచంలోని అతిపెద్ద k-12 పాఠశాలలను నడుపుతున్నాడు.   అతన్ని 2007 సంవత్సరపు అత్యుత్తమ ఆసియా వ్యాపారవేత్త తో సహా అనేక అవార్డులతో సత్కరించారు. అలాగే 2012లో మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్  సీఈవో గా ఎడ్యుకేషన్ బిజినెస్ లీడర్ గా అవార్డులు సొంతం చేసుకున్నాడు. విద్యా రంగంలో చేసిన కృషికి ఆయనకు అవార్డులు లభించాయి.

3. అబ్దుల్ బిన్ అహ్మద్ అల్ ఘురైర్(Abdulla Bin Ahmad Al Ghurair) 

ఇతని మొత్తం ఆస్తుల విలువ 4.9 బిలియన్ డాలర్లు.  మాష్రేక్‌బ్యాంక్‌ను స్థాపించాడు. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రముఖ బ్యాంకులలో ఒకటి.  దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

4. బి.ఆర్. షెట్టి.  (B.R.Shetty)

ఇతని ఆస్తుల విలువ 2.6 బిలియన్ డాలర్లు. భారతీయ మూలాల కలిగిన దుబాయ్ వ్యాపారవేత్త. దుబాయ్ లో అనేక వ్యాపారాలను సొంతం చేసుకున్నాడు.  ఆరోగ్య సంరక్షణ , ఆర్థిక సేవల సామ్రాజ్యానికి అధిపతి అయిన ఇతనికి బి.ఆర్. లైఫ్, ఎన్ఎంసి హెల్త్ కేర్, ఫైనాబీఆర్ హోల్డిగ్ వంటి కంపెనీలు ఉన్నాయి.  తన సంపదలో సగం సేవా కార్యకలాపాలను విరాళంగా ఇచ్చే విషయంపై 2018లో అతను సంతకాలు చేసి తనలో నిజమైన మానవత్వం ఉందని నిరూపించుకున్నాడు. 

5. సైఫ్ అల్ ఘురైర్ (Saif Al Ghurair)

ఇతని  ఆస్తుల నికర విలువ 1.7 బిలియన్.  ప్రపంచంలోని టాప్ 500 ధనవంతులలో తన పేరును నమోదు చేసుకున్నాడు. అతను యుఎఇలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్,  ప్రొడక్షన్  సంస్థలలో ఒకటైన అల్ ఘురైర్ గ్రూపుకు అధిపతి.  యాష్రెడ్‌లో కొన్ని పెట్టుబడులను కలిగి ఉన్నాడు, ఇది యుఎఇలో ప్రైవేటు ఆధీనంలో ఉన్న పురాతన బ్యాంకు.

6. మిక్కీ జగ్టియాని.(Micky jagtiani)

ఇతని ఆస్తుల విలువ 3.1 బిలియన్ డాలర్లు. ఈ స్థాయికి చేరుకోవడానికి అతను ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అట్టడుగు నుండి అత్యున్నత స్థానం వరకు సాగింది అతని ప్రస్థానం. లండన్ లో టాక్సీ డ్రైవర్‌గా తన క్యారియర్‌ను ప్రారంభించిన అతను 1973 సంవత్సరంలో యుఎఇకి వచ్చాడు. బహ్రెయిన్‌లో 10 సంవత్సరాలు బేబీ ప్రొడక్ట్ షాపును నడిపి, తరువాత దానిని మరింత విస్తరించాలని నిర్ణయించుకొని ఆ వ్యాపారాన్ని 6 షాపుల వరకు విస్తరించాడు.

గల్ఫ్  యుద్ధం ప్రారంభమైన తరువాత, అతను ప్రస్థానం కొనసాగింది. ల్యాండ్‌మార్క్ గ్రూప్ అనే కార్పొరేషన్‌ను స్థాపించాడు . అది కాస్త  ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ , ఫర్నిచర్ వంటి ఇతర వ్యాపారాలను విస్తరించింది. దాంతో మిక్కీ  సంపన్నుల జాబితాలో చేరాడు.   ఫోర్బ్స్  జాబితా ప్రకారం ప్రపంచంలోని ధనవంతుల్లో ఇతను 478 వ స్థానంలో ఉన్నాడు.

7. ఎం.ఏ.యూసుఫ్ అలీ(M.A.Yusuff Ali)

ఇతని ఆస్తుల విలువ 3.7 బిలియన్ డాలర్లు. అతను లులు గ్రూప్ ఇంటర్నేషనల్ అధిపతి. భారతదేశంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టిన వ్యాపారవేత్త. తన వాణిజ్యవ్యాపారాలను అంతకంతకు పెంచుకుంటూ సంపన్నుల జాబితాలో చేరాడు.

8. రవి పిళ్ళై. (Ravi Pillai)

ఇతని ఆస్తుల విలువ 4.2 బిలియన్ డాలర్లు. ఇతను కేరళకు చెందిన వ్యక్తి. దురదృష్టవశాత్తు అతని వ్యాపారం క్షిణించడంతో  దుబాయికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి స్థానిక భాగస్వామి సహాయంతో ఒక చిన్న వాణిజ్య వ్యాపారాన్ని ప్రారంభించాడు. రెండు సంవత్సరాలల్లో అతని వ్యాపారం అపారంగా పెరిగింది. రవి పిళ్ళై  కొత్తగా నాజర్ ఎస్.హాల్.హజారే కార్పొరేషన్ (NSH) ను స్థాపించాడు. దుబాయ్ లోని ధనవంతుల జాబితాలో చేరాడు.